
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ గత సంవత్సరం విడుదల చేసిన Realme GT 7Tపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశం. 7000mAh బ్యాటరీతో వస్తున్న Realme GT 7T ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇప్పుడు Realme GT 7Tపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
Also Read : అప్పు చేసైనా Oppo కొనేయాలి మావా.. 200mp కెమెరా ఫోన్ భలే ఉందిగా..!
Realme GT 7T Offers
Realme GT 7Tలోని 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 41,999 ప్రారంభ ధరతో విడుదల అయింది. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ flipkartలో రూ.33,999 ధరకు లభిస్తుంది. అంటే ఈ Realme GT 7T ఫోన్ దాని ప్రారంభ ధర కంటే సుమారుగా రూ.8,000 తక్కువకు అందుబాటులో ఉంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.10,000 వరకు ధర తగ్గింపు లభిస్తుంది. ఇది పూర్తిగా వర్తిస్తే Realme GT 7T మొబైల్ కేవలం రూ.23,999లకే కొనేయొచ్చు. అయితే ఇంతపెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.
Realme GT 7T Features
Realme GT 7T ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 1280×2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కూడిన 6.80-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 MAX చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Realme GT 7T వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 పై పనిచేస్తుంది.
Also Read : ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఉన్నా మనం భారతీయులు కాదా? మరి ఏ డాక్యుమెంట్లు కావాలంటే ?









