
Hardik Pandya : టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రియురాలు, మోడల్ మహీకా శర్మను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇందుకు కారణం ఓ ఫోటోనే కావడం విశేషం. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు హార్దిక్ పాండ్యా గానీ, ఇటు మహీకా శర్మ గానీ ఈ రూమర్లపై స్పందించలేదు.
గత ఏడాది కాలంగా వీరిద్దరూ తమ రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో ఎంతో ఓపెన్‌గా ఉంటున్నారు. ఒకవేళ నిజంగానే పెళ్లి చేసుకుని ఉంటే, ఆ విషయాన్ని వారే స్వయంగా అభిమానులతో పంచుకునేవారని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో వారు ఏదైనా వ్యక్తిగత పర్యటనకు లేదా గుడికి వెళ్లినప్పుడు తీసిందే అయి ఉంటుందని, అక్కడ కలిసిన ఒక పెద్ద వయసు ఆవిడ వారితో ఫోటో దిగి ఉండవచ్చని తెలుస్తోంది.
Also Read : బీజేపీది నకిలీ హిందుత్వం.. స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు!
Have Hardik Pandya and Maheika Sharma tied the knot secretly? Viral photo sparks rumors of Hardik Pandya's secret wedding,No official confirmation from Hardik or Mahieka on marriage pic.twitter.com/nhntLD4nmN
— Verses (@Verses544123) June 27, 2026
నటాషా స్టాన్కోవిచ్తో 2024 జూలైలో విడాకులు తీసుకున్నప్పటి నుంచి హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ నిరంతరం వార్తల్లో ఉంటోంది. వీరిద్దరికీ అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత, సెప్టెంబర్ 2025లో మహీకా శర్మ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో హార్దిక్ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టే, అక్టోబర్ 2025లో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌ల్లో కూడా హార్దిక్‌ను ప్రోత్సహించడానికి మహీకా స్టేడియానికి రావడం విశేషం. ఏదేమైనా, ఈ తాజా ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తున్నప్పటికీ, వీరి పెళ్లిపై స్పష్టత రావాలంటే మాత్రం హార్దిక్ స్పందించాల్సిందే.
Also Read : రూ.888లకే ఆల్-ఇన్-వన్ బేబీ బెడ్డింగ్ సెట్.. నిద్రకు కొదవ లేదు..!









