DMK

DMK : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని DMK కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత 9 ఏళ్లుగా డీఎంకేతో కలిసి నడుస్తున్న వైకో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ.. ఆ కూటమి నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుత అధికార పార్టీ అయిన విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమిలో చేరుతున్నట్లు మాత్రం ఎండీఎంకే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఎండీఎంకే ఆమోదించిన తీర్మానాల్లో.. సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించారు. అవినీతి రహిత పాలన అందించడం, మేకేదాటు ఆనకట్ట వంటి విషయాల్లో తమిళనాడు హక్కులను కాపాడటం లాంటి ఎన్నికల హామీలపై రాజీపడకుండా పనిచేయాలని విజయ్ ప్రభుత్వానికి ఎండీఎంకే విజ్ఞప్తి చేసింది.

ఎండీఎంకే ఆరోపణలను డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఎండీఎంకేకు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం దక్కేలా చేసింది డీఎంకేనే. వైకో కొడుకు దురై వైకోకు పార్టీలో పదవి ఇవ్వడం వల్లే ఎండీఎంకే బలహీనపడింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వైకో చేసిన పోరాటానికే ఇది విరుద్ధం అని డీఎంకే నేత సయ్యద్ హఫీజుల్లా కౌంటర్ ఇచ్చారు.

Also Read : ‘వివాహం రద్దు చేసుకోవడం కంటే చంపడమే సులభం అనుకున్నా’.. సియా షాకింగ్ నిజాలు!

సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్

ఇదిలా ఉంటే, కూటమి నుంచి తప్పుకున్న ఎండీఎంకేకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఇద్దరు ఎండీఎంకే ఎమ్మెల్యేలు ఈ సాధారణ సభ సమావేశాన్ని బహిష్కరించారు. తాము డీఎంకేతోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. దీనివల్ల ఎండీఎంకే ఒకవేళ టీవీకేతో చేతులు కలిపినా.. అసెంబ్లీలో అధికార టీవీకే బలం ఇప్పుడప్పుడే పెరగదు, అలాగని ఉపఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదు.

Also Read : బుర్రపాడు బ్రో: 10,001mAh బ్యాటరీతో ఊరమాస్ స్మార్ట్‌ఫోర్లు ఇవే..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.