FIFA World Cup 2026
FIFA World Cup 2026

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ట్రోఫీలో పాల్గొన్న జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇకపై మరో ఎత్తులా ఈ టోర్నీలో మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. లీగ్ స్టేజ్ ముగిసి నాకౌట్ స్టేజ్‌లు స్టార్ట్ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. టోర్నీ ప్రారంభంలో 48 జట్లు బరిలోకి దిగగా.. లీగ్ స్టేజ్‌లో పలు జట్లు ఇంటి ముఖం పట్టాయి. దీంతో నాకౌట్ స్టేజ్‌కు 32 జట్లు అర్హత సాధించాయి.

Fifa World Cup 2026:

ఇక్కడనుంచి ఏ జట్లు అయితే గెలుస్తాయో అవి మాత్రమే ముందుకు వెళ్తాయి. మరోవైపు ఈ ఫిఫా ఫుట్‌బాల్ టోర్నీలో ఆఫ్రికా దేశాలు తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త చరిత్రను నెలకొల్పాయి. ఈసారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఆఫ్రికా దేశాలు నాకౌట్‌లో అడుగుపెట్టాయి. గతంలో 2014, 2022 వరల్డ్ కప్ ట్రోఫీలో ఆఫ్రికాకు చెందిన దేశాలలో కేవలం రెండు టీంలు మాత్రమే నాకౌట్ వరకు వెళ్లాయి. కానీ ఈ సారి అలా జరగలేదు.

మొత్తం 10 జట్లలో 9 జట్లు పోటా పోటీగా నాకౌట్లలో అర్హత సాధించి ఆశ్చర్యపరిచాయి. ఈ జట్లలో మొరాకో, సౌత్ ఆఫ్రికా, ఐవరీ కోస్ట్, ఈజిప్ట్, కేప్ వెర్డే, సెనెగల్, ఘనా, అల్జీరియా, డీఆర్ కాంగో జట్లు నాకౌట్‌లో ఉన్నాయి. ఇకపోతే మొత్తం 32 నాకౌట్ జట్లలో గెలిచిన జట్లు రౌండ్ 16కు చేరుతుంది. అక్కడ నుంచి క్వార్టర్స్ ఫైనల్‌కు 8 టీంలు వెళ్తాయి. అందులో గెలిచిన 4 జట్లు సెమీస్‌లో పోటీ పడతాయి. అక్కడ నుంచి రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఈ 32 టీంలకు రేపటి నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

జూన్ 29: బ్రెజిల్ – జపాన్, దక్షిణాఫ్రికా – కెనడా
జూన్ 30: ఐవరీ కోస్ట్ – నార్వే, జర్మనీ – పరాగ్వే, నెదర్లాండ్స్‌ – మొరాకో
జులై 1: ఫ్రాన్స్‌ – స్వీడన్, మెక్సికో – ఈక్వెడార్, ఇంగ్లాండ్ – డీఆర్ కాంగో
జులై 2: యూఎస్‌ఏ – బోస్నియా, బెల్జియం – సెనెగల్
జులై 3: స్పెయిన్ – ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ – అల్జీరియా, పోర్చుగల్ – క్రొయేషియా, ఆస్ట్రేలియా – ఈజిప్ట్,
జులై 4: అర్జెంటీనా – కేప్‌ వెర్డె, కొలంబియా – ఘనా టీంలు తలపడనున్నాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.