Gautam Gambhir

ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ను కోల్పోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఈ సిరీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇలాంటి దారుణమైన ఓటమిని చవిచూడటంతో విమర్శకులకు బలమైన ఆయుధం దొరికినట్లయింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడం దగ్గర నుండి, కోచ్ గంభీర్ తీసుకున్న ఆటగాళ్ల ఎంపిక నిర్ణయాల వరకు ప్రతి ఒక్కరినీ విమర్శకులు టార్గెట్ చేస్తున్నారు.

ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత జట్టు, ఐర్లాండ్ చేతిలో ఇలా అవమానకర రీతిలో ఓడిపోవడంతో సోషల్ మీడియాలో గంభీర్‌పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇదే తరుణంలో, ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో గంభీర్‌ను దారుణంగా ఎగతాళి చేసింది. ఐర్లాండ్‌లో గంభీర్ సాధించిన ఈ అద్భుతమైన ఫలితాల దృష్ట్యా, అతన్ని తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకోవడానికి తాము అస్సలు ఇష్టపడట్లేదంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది.

Also Read : ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ !

భారత్‌కు ఎంతో అవసరం

మరోవైపు, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ గంభీర్ వ్యూహాల్లోని లోపాలను విశ్లేషిస్తూ విమర్శలు గుప్పించారు. జట్టులో పార్ట్-టైమ్ ఆల్‌రౌండర్లను ఎక్కువగా నింపేయడం కంటే, మిడిల్ ఆర్డర్‌లో ఒక పక్కా ప్యూర్ బ్యాటర్ ఉండటం భారత్‌కు ఎంతో అవసరమని ఆయన వాదించారు. కాగా ఐర్లాండ్ సిరీస్ ముగియడంతో, భారత జట్టు ఇప్పుడు జూలై 1 నుండి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టనుంది.

Also Read : సీక్రెట్గా హార్దిక్ పాండ్యా పెళ్లి.. సంచలన ఫోటో వైరల్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.