
SIR : ఉద్యోగం రీత్యానో, పిల్లల చదువుల కోసమో లేదా సొంత ఇల్లు కొనుక్కునో.. చాలా మంది ఒక ఊరి నుంచి మరో ఊరికి, లేదా ఒకే సిటీలో ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు ఇల్లు మారుతుంటారు. ఇల్లు మారినప్పుడు ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అడ్రస్‌లు మార్చుకుంటారు కానీ, ఓటు మార్చుకోవడాన్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఓటు ఎక్కడుంటే ఏముందిలే, ఎన్నికలప్పుడు వెళ్లి వేయొచ్చు అని అనుకుంటారు. కానీ, ఓటర్ల జాబితా సవరణ SIR జరుగుతున్న ఈ సమయంలో మీ ఓటును కొత్త అడ్రస్‌కు మార్చుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, అసలు ఓటును ఎలా మార్చుకోవాలో చూద్దాం.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అధికారులు ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. వారు మీ పాత ఇంటికి వెళ్లినప్పుడు మీరు అక్కడ లేరని తెలిస్తే.. ఇక్కడ నివసించడం లేదు అని రాసుకుంటారు. దీనివల్ల ఓటర్ లిస్ట్ నుంచి మీ పేరు పూర్తిగా తొలగించబడే అయ్యే) అవకాశం ఉంది.
ఒకవేళ పేరు తొలగించకపోయినా, ఓటు వేయడానికి ఎన్నికల రోజున పాత ఊరికి లేదా పాత ఏరియాకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఉండే రద్దీలో అంత దూరం వెళ్లడం బద్ధకించి చాలా మంది ఓటు వేయడమే మానేస్తారు.
Also Read : రైతు భరోసా డబ్బులు రిలీజ్!
మీరు ఖాళీ చేసిన పాత ఇల్లు లేదా పాత ఏరియాలో మీ పేరు అలాగే ఉంటే, దాన్ని కొందరు తప్పుడు పనులకు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. మీ స్థానంలో వేరే వాళ్లు దొంగ ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇల్లు మారినప్పుడు ఓటు మార్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు. మీ మొబైల్లో Voter Helpline App డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లాలి.
ఓటును ఒక చోటు నుంచి మరో చోటుకి మార్చడానికి, లేదా అడ్రస్ మార్చడానికి ‘ఫామ్-8’ నింపాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం ఉంటున్న కొత్త ఇంటి అడ్రస్ ప్రూఫ్ (కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా కొత్త ఆధార్ కార్డ్) ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
ఆన్లైన్ రానివారు మీ ఏరియా బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)ని కలిసి ఫామ్-8 అప్లికేషన్ ఇస్తే, వారు మీ కొత్త అడ్రస్‌కు ఓటును మారుస్తారు.ఇల్లు మారిన ప్రతిసారీ మీ ఓటును కూడా కొత్త అడ్రస్‌కు మార్చుకోవడం బాధ్యతగల పౌరుడిగా మీ కర్తవ్యం. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపయోగించుకుని వెంటనే మీ ఓటును కొత్త ఇంటి అడ్రస్‌కు మార్చుకోండి.
Also Read : మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం: సైబర్ క్రైమ్ పోలీసుల రంగప్రవేశం









