IRCTC Tour Package
IRCTC Tour Package

మీకు ఆధ్యాత్మిక ప్రదేశాలంటే ఎంతో ఇష్టమా?.. ప్రముఖ దేవాలయాలను చుట్టి రావడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అదిరిపోయే ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. దీని ద్వారా సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను అతి తక్కువ సమయంలోనే చుట్టి రావచ్చు. దీనికోసం ‘ సౌత్ ఇండియా టెంపుల్ రన్’ పేరుతో విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్యాకేజీలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చి, త్రివేండ్రంలోని ప్రముఖ, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు కొనసాగుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది. దీనికి టికెట్ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టూర్ ప్యాకేజీ(IRCTC Tour Package) వచ్చే నెల అంటే ఆగస్టు 16న ప్రారంభం అవుతుంది. ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానం బయల్దేరుతుంది.

మొదటి రోజు త్రివేండ్రం చేరుకుని అక్కడ పువార్ ఐలాండ్, అజిమల శివాలయాన్ని సందర్శిస్తారు.

రెండో రోజు తెల్లవారుజామున పద్మనాభస్వామి ఆలయానికి వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం కన్యాకుమారి చేరుకుని అక్కడ సూర్యస్తమయం పాయింట్ సందర్శిస్తారు.

మూడో రోజున కన్యాకుమారిలోనే రాక్ మెమొరియల్, తిరువళ్లుర్ విగ్రహాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి అదే రోజు రామేశ్వరం చేరుకుంటారు.

నాలుగో రోజు రామేశ్వరం, ధనుష్ కోఠి ఆలయాలకు వెళ్తారు. కాగా స్థానిక ఆలయాలను సందర్శించడానికి యాత్రికులు ప్రైవేట్ వెహికల్స్‌కు తమ డబ్బులనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఐదోరోజున రామేశ్వరంలోని అబ్దుల్‌కలాం మెమొరియల్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి తంజావూరుకు వెళ్తారు. అక్కడ ప్రసిద్ధ బృహదీశ్వర దేవాలయానికి వెళ్తారు. అక్కడ నుంచి తిరుచ్చికి చేరుకుంటారు.

ఆరో రోజు శ్రీరంగం ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత మదురై పయనమవుతారు. ఆ రోజు సాయంత్రం మదురైలో షాపింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

ఏడోరోజు మీనాక్షి ఆలయానికి వెళ్లి అక్కడ నుంచి మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

Also Read : వాట్సాప్‌ యూజర్‌నేమ్ ఫీచర్: సైబర్ అటాక్‌లపై ఆందోళన..!

వీటి ధరల విషయానికొస్తే..

హోటల్‌ల్లో ఒక్కరికి (ఒకే రూమ్) రూ.52,550
ఇద్దరికి రూ.39,850
ముగ్గురికి రూ.37,700
5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు (విత్ బెడ్) రూ.33,000
5 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు (విత్ అవుట్ బెడ్) రూ.28,700
2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ.21,400 చెల్లించాలి.

మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read : యూజర్‌నేమ్‌ వ్యవహారం.. వాట్సప్‌కు కేంద్రం నోటీసులు..