Trisha Krishnan : హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు ఆన్‌లైన్ షాపింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ బట్టల బ్రాండ్ జారా పై ఆమె సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఆ కంపెనీ నుండి తాను ఆర్డర్ చేసిన బట్టలు ఒంటి చెమట వాసన వస్తున్నాయంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఇలా జరగడం ఇది ఒకసారి కాదు, వరుసగా మూడోసారి అని త్రిషా చెప్పారు.

ఈ డెలివరీలపై త్రిషా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాను ఏమేం బట్టలు కొన్నారనే వివరాలు ఆమె చెప్పలేదు కానీ, ఆ కంపెనీకి ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. ఇంటికి పంపించే బట్టల నుండి ఎలాంటి చెడు వాసన రాకుండా చూసుకోవాలని కోరారు. బట్టల నుండి కొద్దిగా వాసన వచ్చినా అస్సలు ఒప్పుకోలేమని చెప్పారు. బట్టలను బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసేవాళ్లు, పంపించే ముందు ఒక్కసారి వాటిని వాసన చూసి చెక్ చేయాలని త్రిషా కోరారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, త్రిషా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా సినిమా కరుప్పు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ హిట్ సాధించింది. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ పెద్ద సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్, అజిత్ నటిస్తున్న విడాముయర్చి, అలాగే విజయ్ సేతుపతి సినిమాల్లో కూడా త్రిషా ముఖ్య పాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.