sri lanka

Sri Lanka : శ్రీలంకలోని ఓ జైల్లో ఖైదీలకు, జైలు అధికారులకు మధ్య జరిగిన భీకర ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈ ఘోర దాడిలో ఇప్పటివరకు కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా ఖైదీలు, అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబో శివార్లలో ఉన్న ఒక జైల్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

ఇక వివారల్లోకి వెళితే.. కొలంబోకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెగోంబో అనే ప్రాంతంలోని జైల్లో ఆదివారం నుంచే ఈ గొడవలు మొదలయ్యాయి. జైలు లోపల జరిగిన ఈ ఘోర ఘర్షణలో చనిపోయిన వారిలో, అలాగే గాయపడిన వారిలో అటు ఖైదీలు, ఇటు జైలు సిబ్బంది ఇద్దరూ ఉన్నారు.అయితే, అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. భద్రతా సంస్థలు దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి.

Also Read : పాకిస్థాన్‌కు పీవోకే అల్టిమేటం: 48 గంటల డెడ్‌లైన్.. జులై 9న ఫైనల్ యాక్షన్!

మరోవైపు, ఈ గొడవలో గాయపడిన 100 మందికి పైగా బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందనే పూర్తి వివరాలను చెప్పడానికి అక్కడి వైద్య అధికారులు నిరాకరించారు. కాగా, శ్రీలంకలోని జైళ్లన్నీ ప్రస్తుతం ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. కేవలం 10,000 మంది పట్టే సామర్థ్యం ఉన్న అక్కడి జైళ్లలో.. ప్రస్తుతం ఏకంగా 39,000 మందికి పైగా ఖైదీలను ఉంచడం గమనార్హం.

Also Read : అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం..టెహ్రాన్‌లో హోరెత్తిన ప్రతీకార జ్వాలలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.