
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా సూపర్ హీరో బాబు (తమిళంలో సూపర్ హీరో). తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. బెలూన్, డిక్కిలూనా, పార్కింగ్ వంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత కె.ఎస్. సినిష్, సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శంజన్ జితో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతంలో కార్తీక్ యోగి, రామ్ వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసిన సినిష్, ఇప్పుడు తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విఘ్నేష్‌ను మెగాఫోన్ పట్టించారు.
తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న అర్జున్ దాస్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, ఆయనకు జోడీగా తేజు అశ్విని నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకుని లోక చాప్టర్ 1, కిష్కిందపురి సినిమాలతో నటుడిగానూ హాట్ టాపిక్‌గా మారిన శాండీ మాస్టర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, శాండీ మాస్టర్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాకు ఖుషి,హాయ్ నాన్న, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి ఫీల్ గుడ్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన అందించిన స్వరాలు ఇప్పటికే సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సూపర్ హీరో బాబు థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.









