Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Vijay Vs Stalin: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు

Stalin - CM Vijay
Stalin - CM Vijay

తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలసిందే. అనంతరం డీఎంకే అధినేత విజయ్ ప్రసంగంపై ఫైర్ అయ్యారు. మొదటి ప్రసంగంలోనే ప్రభుత్వం వద్ద లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఖజానాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది పరిపాలించే సామర్థ్యం మాత్రమేనని తెలిపారు. కేంద్రంలో బీజేపీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసినా.. కరోనా, వరదలు లాంటి సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. ప్రజల కోసం లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. 

Also Read: విజయ్‌ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి…ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ …

గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేసిందని చెప్పడం సరికాదన్నారు. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి స్పష్టంగా వివరించామన్నారు. అది తెలిసిన తర్వాతే ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చామని పేర్కొన్నారు. మీకు ఓటేసిన ప్రజలను మళ్లీ మోసం చేయకండని.. విజయాన్ని పక్కదారి పట్టించకండని హితువు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో.. త్వరలోనే ఆ మెళకువలను నేర్చుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.  

Also Read: అమెరికాలో దారుణం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం