ప్రస్తుతం ఏపీలో కోవిడ్ 19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా సోకి ఇటీవల నలుగురు మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ కోవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో చాలా మందికి కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2021-2022లో వేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ 2026లో వచ్చే కొత్త వేరియంట్ నుండి రక్షణ కల్పించగలగుతుందా? లేకపోతే కొత్త కోవిడ్ 19 వేరియంట్‌కు వేరేగా వ్యాక్సిన్ వేస్తున్నారా? అనేది చూద్దాం.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ RF.5ను గుర్తించారు. ఏపీలో ఈ కరోనా వైరస్ కొందరికి నమోదు కాగా.. పూణేలోని వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను కనుగొన్నారు. అయితే ఈ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ RF.5 అనేది ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. RF.5 గతంలో కనుగొన్న ఒమిక్రాన్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. అందువల్ల ఈ కొత్త వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ RF.5 వేరియంట్ కొత్తది కాదని.. రెండు వేర్వేరు వేరియంట్ల కలయిక అని అన్నారు. ఈ కొత్త వేరియంట్ RF.5 స్వతంత్రంగా వచ్చింది. RF.5 అనేది కరోనావైరస్ యొక్క JN.1 వేరియంట్లు, LF.7, PY.1.1.1ల నుంచి పుట్టినది తెలిపారు.

RF.5 అనేది కోవిడ్-19 ఒమిక్రాన్ స్ట్రెయిన్‌కు చెందిన ఒక ఉప-రకం. ఈ వైరస్ తీవ్రమైనదా కాదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పెద్దగా ఈ వైరస్ కోసం భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న జలుబు చేసినా కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

Also Read : తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. రూమ్స్ కేటాయింపులో కొత్త రూల్స్.. అవేంటంటే?

పాత వ్యాక్సిన్‌ పనిచేస్తుందా?

అయితే కోవిడ్ 19 వచ్చినప్పుడు ప్రభుత్వం కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలను ప్రజలకు ముందు జాగ్రత్తగా వేయించింది. కొందరికి ఒక డోస్‌తో పాటు రెండు డోస్‌లను వేయించింది. అయితే బూస్టర్ డోస్‌తో పాటు రెండు డోసుల టీకా తీసుకున్న వారికి ఈ కొత్త వ్యాక్సిన్‌తో బెనిఫిట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టీకా వేయించుకోవడం వల్ల కోవిడ్ రాకుండా ఉండదని కాదు. రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనా వైరస్ వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్యులు తెలిపారు.

Also Read : ఐటీ నిపుణులకు బిగ్ షాక్…ఈసారి రెండో హెచ్-1బీ లాటరీ లేనట్టే!

కరోనా రాకూడదంటే?

కరోనావైరస్ రాకుండా ఉండాలంటే చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మాస్క్ ధరించండి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. శానిటైజర్ ఉపయోగించండి. అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.