Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

VD Satheesan Kerala CM: కేరళ సీఎంగా వీడీ సతీషన్‌.. ప్రకటించిన హైకమాండ్

VD Satheesan Kerala CM
VD Satheesan Kerala CM

VD Satheesan Kerala CM: కేరళ సీఎంగా వీడీ సతీషన్ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ తదితరుల మధ్య జరిగిన సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా  తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.  కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం వీడీ సతీషన్  వైపు మొగ్గు చూపింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత కేరళకు సీఎం ఖరారయ్యారు.  

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 140 స్థానాలకు గాను 102 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)  కేవలం 35 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.