సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి సినిమా ‘ శ్రీనివాస మంగాపురం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆరెక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ భూపతి చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమాపై ఘట్టమనేని అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలకు తగ్గట్టు సినిమా మెప్పించిందా? తొలి సినిమాతోనే జయకృష్ణ హిట్టు కొట్టాడా? అనేది ఇప్పుడు చూద్దాం..

Also Read : ‘శ్రీనివాస మంగాపురం’ లో సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ! వీడియో వైరల్

మూవీ రివ్యూ 

తిరుపతి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. తొలి సినిమా అయినప్పటికి జయకృష్ణ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అక్కడక్కడ తన నటనతో తాత సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేశాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఇక హీరోయిన్ రాషా తడానీ కూడా తన గ్లామర్, అభినయంతో బాగానే ఆకట్టుకుంది.

రొటీన్ కథనం

ఇక సినిమా కథనం విషయానికి వస్తే.. రొటీన్ స్క్రీన్ ప్లేతో .. ఎక్కడా కొత్తదనాన్ని పంచలేకపోయిందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ‘ఆరెక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ తో మెప్పించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాలో తనదైన మార్క్ క్రియేట్ చేయలేకపోయడని తెలుస్తోంది.
కథలో ఏదైనా మలుపు ఉంటుందేమో అని ఎదురుచూసేవారికి నిరాశే మిగులుతుందని చెప్పొచ్చు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే పంథాలో సాగుతోంది. ‘పాట-ఫైట్-పాట’ ఇదే ఫార్ములాలో సాగడంతో స్క్రీన్ ప్లే బోర్ కొట్టించిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లోని సన్నివేశాలు చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. అలాగే విలన్ గా మోహన్ బాబు పాత్రను సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. మొత్తానికి అటు సోషల్ మీడియా, ఇటు ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఏదైనా కొత్తదనం ఆశించి వెళ్లే వారికి నిరాశే కలిగిస్తోందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్

  • జయకృష్ణ నటన, డాన్సులు, యాక్షన్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే BGM, పాటలు కూడా మెప్పించాయి.

Also Read : అలా మాట్లాడడం సిగ్గుచేటు… కంగనాకు సోనూసూద్ కౌంటర్!

మైనస్ పాయింట్స్

  • రొటీన్ కథనం
  • సెకండ్ హాఫ్‌లో ప్రిడిక్ట్ చేయగలిగే సన్నివేశాలు