Thursday, May 21, 11:48
34.2 C
Hyderabad

US Iran War Operation Sledgehammer: ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్’.. ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సరికొత్త ప్లాన్

US Iran War Operation Sledgehammer
US Iran War Operation Sledgehammer

US Iran War Operation Sledgehammer: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి ఒప్పందాలు ఫలించడం లేదు. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై మళ్లీ దాడులకు దిగితే పెద్దఎత్తున విరుచుకుపడతాం అంటూ హెచ్చరికలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకవేళ అమెరికా ఇరాన్‌పై దాడులు చేయాల్సిన పరిస్థితులు వస్తే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ‘ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్‌’ అనే పేరు మార్చి దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై చేసిన సైనిక చర్యకు అమెరికా.. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేయగా.. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇరాన్‌పై చేపట్టిన సైనిక ఆపరేషన్ ముగిసిందని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు చెప్పింది. యుద్ధం ముగింపు విషయంలో అమెరికా, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిపాదనలకు రెండు దేశాల కూడా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. అందుకే ఒప్పందానికి రాకుంటే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. 

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

అందుకే ఒకవేళ అమెరికా ఇరాన్‌పై మళ్లీ యుద్ధం చేపడితే దీనికి ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్‌ అనే పేరుతో దాడులు చేయాలని భావిస్తోంది. దీంతో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలిస్తోంది. ఈ పేరు మార్పు వల్ల కొత్త ఆపరేషన్ కోసం ట్రంప్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి పర్మిషన్ తీసుకోవడం కోసం మరో 60 రోజుల సమయం పడుతుంది. అమెరికా రూల్స్ ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. సాధారణంగా శత్రు భూభాగంలో సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లోపు అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 రోజుల్లో కాంగ్రెస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

 ‘ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్’ అనే పదానికి సైనిక చరిత్రలో ఓ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  “స్లెడ్జ్‌హ్యామర్” అంటే పెద్ద సుత్తి అని అర్థం. సైనిక భాషలో ఈ పదాన్ని శత్రువును కోలుకోలేని విధంగా దెబ్బతీసే భారీ దాడులకు వాడుతుంటారు. ఒకవేళ అమెరికా.. కాంగ్రెస్  నుంచి పర్మిషన్ లేకుండా ఇరాన్‌పై అత్యవసరంగా దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తే.. ఈ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేసే ఛాన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేక రాజ్యాంగ అధికారాల ద్వారా.. జాతీయ భద్రతకు తక్షణ ముప్పు ఉందనే కారణంతో కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇలాంటి సైనిక చర్యలు చేపట్టేందుకు ఇలాంటి రహస్య ఆపరేషన్లను సిద్ధం చేస్తారు.

Also Read: హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్

ఈ ఆపరేషన్‌ను అమలు చేసే విధానం అత్యంత వ్యూహాత్మకంగా అలాగే రహస్యంగా జరుగుతుంది. దీని కింద ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, కీలక సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంటారు. అమెరికా తన అత్యాధునిక స్టీల్త్ బాంబర్లు, సైబర్ దాడులు, అడ్వాన్స్‌డ్ క్రూయిజ్ మిస్సైల్స్‌ ద్వారా ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చేందుకు యత్నిస్తుంది. క్షేత్రస్థాయిలో అమెరికా సైనికులను ప్రత్యక్షంగా రంగంలోకి దించకుండానే కేవలం వైమానిక, నౌకాదళ శక్తితో ఇరాన్‌కు కోలుకోని విధంగా దెబ్బకొట్టడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.