Peddi Sudarshan Reddy : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొని, నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 31 అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యాధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఆయనను రక్షించేందుకు వైద్యులు చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అకాల మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం చట్టసభల స్థాయికి చేరింది. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2001లో కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరి, అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా ఘనవిజయం సాధించారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు లొంగకుండా స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉంటూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు.

Also Read : పెద్ది చనిపోవడానికి కారణం అదేనా? ఈ నెల 22న అసలేం జరిగింది?

గత అయిదేళ్ల కాలంలో నర్సంపేట నియోజకవర్గాన్ని సుదర్శన్‌రెడ్డి అభివృద్ధి పథంలో పరుగులు తీయించారు. పంచాయతీ రాజ్, ఆర్‌ అండ్‌ బీ, ఐటీడీఏ శాఖల నుంచి రూ.వందల కోట్ల నిధులు తెచ్చి ప్రతి పల్లెకూ రహదారి సదుపాయం కల్పించారు. నర్సంపేట పట్టణంలో తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రం (టీ-హబ్‌), 220 పడకల జిల్లా జనరల్‌ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలలను మంజూరు చేయించి ప్రాంతీయ వైద్య రంగాన్ని మూలమలుపు తిప్పారు. పట్టణ సౌందర్యీకరణలో భాగంగా పాకాల ఆడిటోరియం, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఆధునీకరించారు.

రైతాంగ సంక్షేమానికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రూ.336 కోట్లతో రామప్ప-పాకాల-రంగాయ చెరువుల్లోకి గోదావరి జలాలను మళ్లించి నర్సంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. నీటి నిల్వ పరిరక్షణకు అన్ని మండలాల్లో కలిపి 13 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు భద్రపరుచుకునేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా రూ.80 కోట్లతో ఆరు మండలాల్లో (ఒక్కోటి 5 మెట్రిక్ టన్నులు) గోదాములు, అలాగే రాష్ట్ర వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ ద్వారా మరో ఆరు గోదాములను (ఒక్కోటి 15 ఎంటీఎస్) మంజూరు చేయించారు. వీటితో పాటు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కరెంటు మోటార్లు రైతులకు అందించారు.

Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు!

కేసీఆర్‌ దిగ్భ్రాంతి

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని తీవ్ర ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను స్మరించుకుంటూ, పెద్దిని బతికించుకోవడానికి పార్టీ , వైద్యులు చేసిన విశ్వప్రయత్నాలు విఫలం కావడం కలచివేసిందన్నారు. నర్సంపేట గడ్డపై గులాబీ జెండా ఎగురవేసిన ధీరుడని, నీతి నిజాయితీలతో సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉద్యమం నుంచి చివరిశ్వాస వరకు పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ కష్ట సమయంలో నర్సంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. శోకతప్త హృదయంతో ఉన్న పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు, ఆయన ధైర్య సాహసాలు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోతాయి. ఉద్యమ సమయంలో పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా ఏనాడు లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొని, నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. జులై 31 అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యాధికారులు అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను రక్షించేందుకు వైద్యులు చేసిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

సామాన్య రైతు బిడ్డ నుంచి చట్టసభల వరకు.. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో సుదర్శన్ రెడ్డి జన్మించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) ఏర్పడిన సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి, అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా ఘనవిజయం సాధించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉంటూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు.

ఉద్యమంలో కన్ను, కాళ్లు కోల్పోయిన పెద్ది

పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు.ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనన్లతో కొడితే ఆయన కుడి కన్ను దెబ్బ తిన్నది. దీంతో ఆయన కుడి కన్ను కనపడదు. అయినా ఆయన ఏనాడు ఉద్యమానికి దూరం కాలేదు.

రాష్ట్ర సాకారం తర్వాతే పెళ్లి

అంతే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి లేదు మరో వ్యక్తిగత జీవితం లేదని భీష్ముంచుకో కూర్చున్న పెద్ది సుదర్శన్ రెడ్డి  2014లో స్వరాష్ట్ర ప్రకటన రాగానే తాను నిర్ణయించుకున్న ప్రకారమే అట్టడుగు వర్గాల దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఆనాడు ఆయన పెళ్లికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దంపతులతో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భార్య స్వప్నను నర్సంపేటలో జడ్పీటీసీని చేసి ఒక నాయకురాలుగా తీర్చిదిద్దారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.