Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

TDP Mahanadu Cancelled: సారీ తమ్ముళ్లు.. TDP మహానాడు రద్దు :  చంద్రబాబు సంచలన నిర్ణయం!

TDP Mahanadu Cancelled
TDP Mahanadu Cancelled

TDP Mahanadu Cancelled: మిడిల్ ఈస్ట్ సంక్షోభం సృష్టించిన ఆర్థిక అనిశ్చితిని తట్టుకునేందుకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏఫెక్ట్ ఇప్పుడు టీడీపీ మహానాడుపై కూడా పడింది. ప్రతీ ఏటా టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహిస్తుంది.  ఈసారి ప్రభుత్వ పొదుపు చర్యల ప్రభావం గట్టిగా పడింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే కాకుండా, పార్టీ పరంగా కూడా పొదుపు పాటించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మహానాడు నిర్వహణను రద్దు వేయడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది.  

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

టీడీపీ అత్యంత వైభవంగా, వేలాది మంది కార్యకర్తలతో మహానాడు నిర్వహిస్తుంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం ఒకవైపు పొదుపు మంత్రం జపిస్తూ.. మరోవైపు పార్టీ పరంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ పండుగలా మహానాడు నిర్వహించడం సరికాదనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారికి మహానాడును రద్దు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

మరోవైపు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో వారానికి ఒక రోజు నో వెహికల్ డే  పాటించాలని పిలుపునిచ్చారు. ఆ రోజున ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ వాహనాలను వాడకుండా పొదుపు చర్యల్లో భాగస్వాములు కావాలని సూచించారు.