

Ravi Prakash
బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఇదే అతిపెద్ద పొలిటికల్ సెట్‌బ్యాకా? నిజానికి ఇది చాలా పెద్ద ప్రశ్న కానీ బంకీపూర్ రిజల్ట్ చూశాక, ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే! ఎందుకంటే ఇది కేవలం ఉప ఎన్నిక కథ మాత్రమే కాదు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. బంకీపూర్ సాధారణమైన సీటు అనుకుంటే పొరపాటే. 1995 నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా ఆ సీటులో బీజేపీకి అసలు తిరుగే లేదు. మొదట నవీన్ కిశోర్ సిన్హా ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గాన్ని ఆ తర్వాత ఆయన కుమారుడు నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు గెలుచుకున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు నితిన్ నబీన్‌ను పార్టీ నేషనల్ ప్రెసిడెంట్‌గా పిక్ చేసుకున్నప్పుడే మెసేజ్ క్లియర్ అయిపోయింది. ఆయన పార్టీలో టాప్ మోస్ట్ ఫేస్ అని. దాంతో నబీన్ జాతీయ రాజకీయాళ్లోకి వెళ్తూ బంకీపూర్ సీటును ఖాళీ చేశారు. ఈ సీటును ఈజీగా గెలుచుకుంటాం అని బీజేపీ ఫిక్స్ అయిపోయింది. కానీ, అక్కడ సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. ఊహించని షాక్ తగిలింది. అప్పటివరకు తిరుగులేదనుకున్న బీజేపీ కోట కళ్లముందే కూలిపోయింది. అనూహ్యంగా జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్(పీకే) ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నిక టైమింగ్ ఒకసారి చూడండి మైండ్ బ్లాంక్ అవుతుంది. బీహార్‌లో గత కొన్ని నెలలుగా వరుస వివాదాలు నడుస్తున్నాయి. ఆ హాట్ పొలిటికల్ వేవ్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ మేజర్ ఎలక్షన్ టెస్ట్ ఇదే. గవర్నెన్స్ మీద వస్తున్న వరుస క్వశ్చన్స్ లా & ఆర్డర్‌పై పబ్లిక్ నుంచి వచ్చిన కోపం రోడ్లపైకి వచ్చిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్స్ E-20 పాలసీ మీద జరిగిన హాట్ డిబేట్స్ యూత్‌ను కదిలించిన జేజేపీ మూవ్‌మెంట్ రామ్ మందిర్ డొనేషన్ క్యాంపెయిన్ మీద పడిన అలిగేషన్స్ ఈ ఫ్యాక్టర్స్ ఈ రిజల్ట్‌ను ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయనేది పార్టీల మధ్య డిబేట్ కావచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఓటర్లు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. అది కూడా బీజేపీ కలలో కూడా ఓడిపోతామని అనుకోని సీటు నుంచి. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఓటమిని ఇచ్చింది ఆర్జేడీ కాదు.. కాంగ్రెస్ అసలే కాదు! కొన్ని నెలల క్రితమే “అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిజాస్టరస్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈయన పని అయిపోయింది” అని అందరూ లైట్ తీసుకున్న ఒక వ్యక్తి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ ఆ పొలిటికల్ కాన్వర్సేషన్‌నే పూర్తిగా మార్చేశారు. మరి ఇది కేవలం ఒక్క నియోజకవర్గంలో జరిగిన అప్‌సెట్ మాత్రమేనా? లేక బీహార్ పొలిటికల్ హిస్టరీలోనే రాబోయే ఒక బిగ్గెస్ట్ డిస్రప్షన్‌కు ఇది బిగినింగా? బంకీపూర్ ఎందుకు కేవలం సాధారణ ఉపఎన్నిక కాదు? రాజకీయ పరిణామాలను విశ్లేషించే ముందు బంకీపూర్ అసలు ఎందుకంత కీలకమైందో ముందుగా మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే, బంకీపూర్ ప్రాముఖ్యత అర్థం కాకపోతే ఈ ఎన్నికల ఫలితం బీజేపీని ఎందుకు అంతగా కుదిపేసిందో అస్సలు అర్థం కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా బీహార్‌లోనే బీజేపీకి అత్యంత సురక్షితమైన, బలమైన స్థానాల్లో ఇది ఒకటి. ఇక్కడ బీజేపీ ఎప్పుడో ఒకసారి గెలవడం కాదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తన గుప్పిట్లో ఉంచుకుంది, ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ నితిన్ నబీన్ తండ్రి ఇక్కడ బీజేపీకి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత నితిన్ నబీన్ ఆ పునాదిని మరింత బలోపేతం చేస్తూ, వరసగా 5 శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. బంకీపూర్‌లో బీజేపీ ఓడిపోదనేంత గట్టి నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఉండేది. ఆ నమ్మకం ఎన్నికల ప్రచారంలో కూడా స్పష్టంగా కనిపించింది. చాలామంది బీజేపీ నేతలు ‘ఈ ఎన్నికలో గెలుపు ఖాయం’ అన్నట్టే ప్రచారం చేశారు. కానీ ఓటర్ల ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఇక్కడి నుంచే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక కులం లేదా ఒక వర్గం ఓట్లతో వచ్చిన విజయం కాదు. పోలింగ్ బూత్‌ల వారీగా వస్తున్న ట్రెండ్స్, రాజకీయ విశ్లేషణలు నిజమే అయితే ప్రశాంత్ కిషోర్ ఒక కులాన్నో, లేక ఒక సామాజిక వర్గాన్నో నమ్ముకొని గెలవలేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచీ ఆయనకు మద్దతు లభించినట్లు కనిపిస్తోంది. అగ్రవర్ణాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు సాంప్రదాయంగా ఎన్‌డీఏకు బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న ప్రాంతాలు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండే కాలనీలు చివరకు బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఏరియాల్లో కూడా పీకే హవా నడిచింది.
ఫైనల్ డేటా కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తే ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటూ ప్రజలు వేసిన స్పష్టమైన ఓటు. రాజకీయాల్లో ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వంపై ఉన్న కోపంతోనో లేదా యాంటీ-ఇంకంబెన్సీతోనో గెలవడం ఒకెత్తయితే ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రత్యామ్నాయంగా నమ్మి ఓటేసి గెలిపించడం మరో ఎత్తు. బంకీపూర్ ఉపఎన్నిక ఇచ్చే అతిపెద్ద మెసేజ్ ఇదే. ఇక్కడ బీజేపీ కేవలం ఒక ప్రతిష్టాత్మకమైన సీటును మాత్రమే కోల్పోలేదు ఫస్ట్ టైమ్ తాను కేవలం వెనుక ఉండి నడిపించే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మాత్రమే కాదు, ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయన్ని అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో ప్రశాంత్ కిశోర్ సక్సెస్ అయ్యారు. ఒకసారి ప్రజల్లో ఆ భావన ఏర్పడితే రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయం ఊహించనంత రసవత్తరంగా, తీవ్రమైన పోటీగా మారబోతోంది. అయితే ఇక్కడ అందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇంకొకటి ఉంది కేవలం కొద్ది నెలల కిందట తన పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసిన తర్వాత ప్రశాంత్ కిశోర్ ఈ స్థాయికి ఎలా పుంజుకోలిగారు? అసలు ఇక్కడిదాకా ఎలా వచ్చారు? ఇక్కడే అసలు సిసలైన రియల్ స్టోరీ మొదలవుతుంది. పొలిటికల్ ఫెయిల్యూర్ నుంచి పొలిటికల్ బ్రేక్‌త్రూ వరకు ప్రశాంత్ కిశోర్‌లో అసలు ఏం మారింది? ఇది ఈ స్టోరీలోనే అత్యంత ఆసక్తికరమైన చాప్టర్! కేవలం కొన్ని నెలల కిందట అందరూ ప్రశాంత్ కిశోర్ పని అయిపోయింది అని డిసైడ్ అయిపోయారు.
ఆయన స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. చాలామంది అభ్యర్థులు ఓడిపోవడమే కాదు డిపాజిట్లు కూడా కోల్పోయారు. దాంతో పొలిటికల్ ఎనలిస్టులంతా ఒక్కటే మాట చెప్పారు పీకే ప్రత్యక్ష రాజకీయంలోకి అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడని! వారి లాజిక్ చాలా సింపుల్‌గా ఉంది. వేరొకరిని గెలిపించడానికి వ్యూహాలు రచించడం వేరు సొంతంగా బరిలోకి దిగి గెలవడం వేరు అని ఆ టైమ్‌లో ఆ విమర్శలన్నీ నిజమేనేమో అనిపించింది. కానీ, చాలామంది పొలిటీషియన్స్ చేయని పనిని ప్రశాంత్ కిశోర్ చేశారు. ఓడిపోయామని ఎక్కడికీ పారిపోలేదు. రాత్రికి రాత్రే తన పొలిటికల్ ఐడియాలజీని మార్చుకోలేదు. తన ఉనికి కోసం ఏ పొలిటికల్ అలయన్స్ వెనకాల పడలేదు. దానికి బదులుగా ఆయన బీహార్‌లోనే స్థిరంగా ఉన్నారు. ఊరూరా తిరిగారు. జనాన్ని నేరుగా కలిశారు.
మొదట్నుంచీ ఆయన దేని గురించైతే మాట్లాడుతున్నారో అదే వలసలు, నిరుద్యోగం, విద్య, వైద్యం, పరిపాలన, బీహార్ భవిష్యత్తు గురించి నిరంతరం గళం విప్పుతూనే ఉన్నారు. జనాలు ఆయనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా అక్కడ ఒక పవర్ ఫుల్ మెసేజ్ మాత్రం వెళ్ళింది అదే ఆయన గివ్ అప్ ఇచ్చే టైప్ కాదని. ఆ నెవర్-గివ్ అప్ ఆటిట్యూడ్ ఇప్పుడు రిజల్ట్స్ చూపించడం స్టార్ట్ చేసింది. ఈ బై-ఎలక్షన్ ఇచ్చింది ఒక మైండ్-సెట్ షిఫ్ట్! ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ పాయింట్ కూడా ఉంది. సాధారణంగా జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పీకే చెప్పే విషయాలు నచ్చినా పోటీ మాత్రం ఎన్‌డీఏ లేదా ఆర్జేడీ కూటమి మధ్యే ఉంది అనుకుని వారికే ఓట్లేశారు. అంటే, బీహార్ రాజకీయం ఇప్పటికీ రెండు ప్రధాన శక్తుల మధ్యే తిరుగుతుందనే భావనలో జనం ఉన్నారు. కొత్త పార్టీకి ఓటేస్తే వేస్ట్ అవుతుందేమోననే భయం కూడా చాలామందిలో ఉండేది.
కానీ, బంకీపూర్ ఉప ఎన్నిక ఆ సైకాలజీని మార్చేసింది. ఇక్కడ ఫైట్ పూర్తిగా కాండిడేట్-సెంట్రిక్‌గా మారిపోయింది. అప్పుడే పీకే ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అత్యంత టఫ్ సీట్ అయిన బంకీపూర్‌ను ఎంచుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ అక్కడ ఓడిపోయి ఉంటే, “పీకే పొలిటికల్ ఎక్స్‌పెరిమెంట్ క్లోజ్ అయిపోయింది” అని విమర్శకులు డిక్లేర్ చేసేవారు. కానీ, బీజేపీకి బలమైన కోట లాంటి సీట్‌లోనే గొడ్డలిపెట్టులాంటి విజయాన్ని సాధించి తన చుట్టూ ఉన్న నెరేటివ్‌ను ఒక్కసారిగా తిరగరాశారు. నిన్నటి వరకు ఆయన కేవలం ఒక సక్సెస్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మాత్రమే కానీ ఈరోజు ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి! ఇదే అతని అతిపెద్ద విజయం కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో పర్సెప్షన్ అనేది రియాలిటీగా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు. ప్రశాంత్ కిషోర్ సాధించిన అతిపెద్ద విజయం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే కాదు బీహార్‌లోని అధిక శాతం ప్రజలు ఆయన్ని ఇకపై కేవలం ఒక కన్సల్టెంట్‌గా కాకుండా ఒక సీరియస్ పొలిటికల్ కంటెండర్‌గా చూడటం స్టార్ట్ చేశారు.
Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్‌ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్
ఈ విజయం ప్రశాంత్ కిషోర్‌కు బిగ్ బ్రేక్‌త్రూ అయితే ఈ విజయం పెద్ద ప్రశ్నలను బీజేపీ, ఆర్జేడీల ముందూ నిలబెట్టింది. ఈ ఫలితం వల్ల బీహార్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెనుమార్పులు జరగబోతున్నాయి. ఈ బై-పోల్ జాతీయ రాజకీయాన్ని ఎందుకు ఇంతలా షేక్ చేస్తోంది? ఇప్పుడు ఒక్క నిమిషం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి, లార్జర్ పిక్చర్ చూద్దాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్‌ను కేవలం ఒక లోకల్ ఉపఎన్నికగా చూస్తే పొరపాటే అవుతుంది. ఇది చాలా చాలా సెన్సిటివ్ టైమ్‌లో వచ్చిన తీర్పు. బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ మేజర్ పొలిటికల్ టెస్ట్ ఇది. దశాబ్దాలుగా బీహార్ రాజకీయంలో బీజేపీ జూనియర్ పార్టనర్‌గానే ఉంది. కానీ, ఈరోజు గవర్నమెంట్‌ను లీడ్ చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే తమ మొదటి బిగ్ ఎలక్షన్ టెస్ట్‌లో, అది కూడా తమ సొంత జాతీయ అధ్యక్షుడి అసెంబ్లీ సీట్‌లోనే బీజేపీ ఓడిపోయింది. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ రిజల్ట్ నేషనల్ లెవల్లో ఎంత పెను సంచలనమో చెప్పడానికి. అంతేకాదు, ఈ రిజల్ట్ వెనుక ఇంకో బిగ్ రీజన్ కూడా ఉంది.
ఒక్కసారి గత కొన్ని వారాలుగా దేశంలో ఏం జరిగిందో రీకాల్ చేసుకోండి. రామమందిర విరాళాల వివాదంపై నేషనల్ మీడియాలో హడావుడి జరిగింది. ఆరోపణలతో ప్రతిపక్షాలు కార్నర్ చేయడానికి ట్రై చేస్తే, బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. E-20 ఇష్యూ ఈ వివాదం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, కామన్ పబ్లిక్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దాదాపు 25 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఊపేసింది. వేలాది మంది యువత రోడ్లెక్కిన అతిపెద్ద పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ ఇది. కేంద్ర మంత్రి రాజీనామా ఈ ఇష్యూ ఎంత సీరియస్ అయిందంటే గత 12 ఏళ్ల మోదీ పాలనలోనే ఫస్ట్ టైమ్ ఒక కేంద్ర కేబినెట్ మినిస్టర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వరుస సంఘటనలన్నీ దేశ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. అయితే ఈ నేషనల్ ఇష్యూస్ వల్లే బంకీపూర్ ఎన్నికల ఫలితం మారిందని నేను చెప్పడం లేదు. ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ ఎనలిస్ట్ కూడా అలా చెప్పలేరు. కానీ, ఏ సీరియస్ ఎనలిస్ట్ కూడా ఈ టైమింగ్‌ను ఇగ్నోర్ చేయలేరు. దేశమంతా రాజకీయంగా తీవ్రంగా చర్చ జరుగుతున్న టైమ్‌లో రూలింగ్ పార్టీ తమకు అత్యంత బలంగా ఉన్న కోటలాంటి సీటునే కోల్పోయినప్పుడు సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి.
బంకీపూర్ ప్రజలు కేవలం ఒక లోకల్ కాండిడేట్‌కు మాత్రమే ఓటేశారా? లేక ఇది దేశంలో మారుతున్న పబ్లిక్ మూడ్‌కు కేరాఫ్ అడ్రసా? ఇప్పుడు బీజేపీ అయినా, అపోజిషన్ అయినా తెలుసుకోవాలని చూస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గరకు వచ్చాం. బంకీపూర్ ఫలితం తర్వాత ఎక్కువగా ఆందోళన చెందాల్సింది ఎవరు? బీజేపీనా? లేక ఆర్జేడీనా? మొదట చూస్తే చాలా మంది ఒకే సమాధానం చెబుతారు. బీజేపీకే పెద్ద షాక్ తగిలింది అని ఎందుకంటే వాళ్లు తమకు అత్యంత బలమైన నియోజకవర్గాల్లో ఒకటిని కోల్పోయారని అంటారు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే మరో విషయం కనిపిస్తుంది. ఈ ఫలితంతో అసలు పెద్ద సవాలు ఎదుర్కొనేది బీజేపీ కాదు ఆర్జేడీ కావచ్చు. ఎందుకంటే ఈ ఒక్క ఎన్నిక బీహార్ రాజకీయాల్లో ఏళ్లుగా కొనసాగుతున్న ఒక నమ్మకాన్నే ప్రశ్నించింది. ఇన్నాళ్లూ బీహార్ పాలిటిక్స్ అంటే ఒకటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండేది. ఒకవైపు ఎన్‌డీఏ ఇంకోవైపు ఆర్జేడీ కూటమి ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం బలంగా ఉండేది. బీజేపీపై జనానికి కోపం వస్తే ఆ ఓట్లన్నీ ఆటోమేటిక్‌గా ఆర్జేడీ జేబులోకి వెళ్లిపోతాయని అంతా అనుకున్నారు. కానీ బంకీపూర్ రిజల్ట్ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. బీజేపీని ఓడించింది ఆర్జేడీ కాదు. ఈ ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థిగా కూడా ఆర్జేడీ నిలవలేదు. ఆ స్థానాన్ని మూడో రాజకీయ శక్తి ఆక్రమించింది. అదే జన్ సురాజ్. ఇదే ఈ ఎన్నికలలో అతిపెద్ద రాజకీయ పరిణామం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది.
ప్రశాంత్ కిషోర్ బై-పోల్‌కి ముందు ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. మూడేళ్లుగా బీహార్ గల్లీ గల్లీ తిరిగాడు. నిరుద్యోగం, వలసలు, చదువు, వైద్యాన్ని ఎజెండాగా మార్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వెనక్కి తగ్గలేదు పని ఆపలేదు. సంస్థను బలోపేతం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ చేతిలో ఇంతకుముందు లేనిది ఒకటి వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన రాజకీయ గుర్తింపు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీలో నంబర్స్ మారకపోవచ్చు కానీ, ఒక పవర్‌ఫుల్ లీడర్ శాసనసభ సాక్షిగా గళమెత్తితే ఆ సెగ బయట ఉన్న రాజకీయ వ్యవస్థ మొత్తానికి తగులుతుంది. ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించి ప్రజా సమస్యలను నిరంతరం లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తానే ఒక ప్రత్యామ్నాయ నాయకుడినని ప్రజలకు నమ్మించగలిగితే ఆయన రాజకీయ ప్రభావం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకపోవచ్చు. అక్కడి నుంచే ఆర్జేడీకి అసలు సవాలు మొదలవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సాంప్రదాయ ప్రతిపక్షం కంటే జన్ సురాజ్‌నే మెరుగైన ప్రత్యామ్నాయంగా చూడడం ప్రారంభిస్తే బీహార్ రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారడం మొదలవుతుంది.
అలా నిజంగానే జరుగుతుందా? ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. ఒక్క ఉప ఎన్నిక ఫలితాన్ని చూసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ఎవరూ చెప్పలేరు. రాజకీయాలు ఎంతోమంది విశ్లేషకులను ఎన్నోసార్లు తప్పు అని నిరూపించాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. బంకీపూర్ బీహార్ రాజకీయ చర్చనే మార్చేసింది. బీజేపీకి ఏ కోటా శాశ్వతంగా అజేయం కాదని ఈ రిజల్ట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆర్జేడీకి ప్రతిపక్ష స్థానం ఇక తమ సొంతమని భావించే రోజులు పోయాయని గుర్తు చేసింది. ప్రశాంత్ కిషోర్‌కు మాత్రం ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు కాదు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పోస్ట్ వదిలేసి ‘పక్కా పొలిటీషియన్’గా మారినందుకు లభించిన ఫస్ట్ అండ్ బెస్ట్ సర్టిఫికెట్.
ఇది కేవలం ఒక సంచలన విజయంగానే మిగిలిపోతుందా? లేక బీహార్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు ఇదే తొలి అడుగా? దానికి సమాధానం కాలమే చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. బంకీపూర్ తర్వాత బీహార్ రాజకీయాలను ఇప్పటివరకు చూసిన కోణంలో ఇక చూడలేం.రాజకీయాల్లో ప్రభుత్వాలను మార్చే ఎన్నికలు కొన్ని ఉంటాయి కానీ, పొలిటికల్ నరేటివ్‌నే మార్చేసే ఎన్నికలు చాలా అరుదుగా వస్తాయి. బంకీపూర్ బై-పోల్ సరిగ్గా ఆ రెండో కేటగిరీకే చెందుతుందేమో అనిపిస్తోంది. అయితే, ఒక చిన్న బై-ఎలక్షన్ రిజల్ట్ చూసి రాబోయే మెయిన్ ఎలక్షన్స్ ఫలితాలను ఇప్పుడే అంచనా వేసేయడం తొందరపాటే అవుతుంది.
ఎందుకంటే, ఉపఎన్నికల చరిత్రను ఒకసారి తిరగేస్తే ఊహించని షాకింగ్ రిజల్ట్స్ రావడం మామూలే.కానీ అదే హిస్టరీ మనకో విషయం కూడా స్పష్టంగా చెప్తోంది. రాజకీయాల్లో మార్పులు ఒకే ఒక్క రోజులో ఊడిపడవు. అవి ఎక్కడో ఒకచోట మొదలవుతాయి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌తో ఒక ఊహించని మెసేజ్‌తో ఓటమి ఎరుగని ఒక తిరుగులేని కోటలో పడిన ఒక చిన్న పిడుగుతో! మరి బంకీపూర్ రిజల్ట్ ఆ రాబోయే పెద్ద మార్పునకు మొదటి పునాదా? లేక ఇది కేవలం ఒక తాత్కాలిక షాకా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ, ఈరోజు తర్వాత ఒక విషయం మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్! బీహార్‌లోని ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ తమ స్ట్రాటజీలను రీ-థింక్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. బీజేపీ తమకు అడ్డా లాంటి బలమైన కోటలు ఎప్పటికీ సేఫ్ అని ఇక భావించలేదు.
ఆర్జేడీ, బీజేపీకి వ్యతిరేకంగా పడే ప్రతి ఓటు ఆటోమేటిక్‌గా తమ అకౌంట్‌కే వస్తుందని అనుకుంటే పొరపాటే. ప్రశాంత్ కిషోర్‌ను ఇకపై కేవలం ఒక ‘ఎలక్షన్ స్ట్రాటెజిస్ట్’ అని తీసిపారేయలేరు. ఈరోజు నుంచి ప్రతి పార్టీ సీరియస్‌గా తీసుకోవాల్సిన ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ ఫ్యాక్టర్‌గా ప్రశాంత్ మారిపోయారు. అయితే, ఈ బంకీపూర్ ఎన్నిక నేర్పిన అన్నిటికంటే పెద్ద పాఠం ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది కాదు! ఇది అసలైన ‘ఓటర్’ శక్తి అని! ఓటర్ ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక సింపుల్ ట్రూత్‌ను మళ్లీ గుర్తుచేశారు. ఏ ఓటూ పర్మినెంట్ కాదు! ఏ కోటా శాశ్వతం కాదు! ఏ పొలిటికల్ నరేటివ్ కూడా ఎల్లప్పుడూ నిలవదు! ఏ రోజైతే ఒక పార్టీ ‘మా గెలుపు ఫిక్స్’ అని అతివిశ్వాసానికి పోతుందో సరిగ్గా అదే రోజున ప్రజాస్వామ్యం ఒక కొత్త కథ రాయడం మొదలుపెడుతుంది. మరి బంకీపూర్ ఆ కొత్త కథకు తొలి అధ్యాయమా? లేక బీహార్ రాజకీయంలో జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చిన పేజీ మాత్రమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే కాలమే సమాధానం చెప్తుంది.
Also Read : సీఎం విజయ్, నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!









