Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Ebola Outbreak: ఎబోలా వైరస్‌ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

WHO declares Ebola outbreak in DR Congo, Uganda a global health emergency
WHO declares Ebola outbreak in DR Congo, Uganda a global health emergency

Ebola Outbreak: ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్(ebola-virus) కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఉగాండాలో కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు లేకపోయినప్పటికీ.. కాంగోతో సహా పొరుగు దేశాల్లో ఇది వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది.  

Also Read: 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష

WHO Declares Ebola Outbreak In DR Congo

ఇప్పటికే పలు దేశాల్లో కూడా ఎబోలా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. 1976లో కాంగోలో మొదటిసారిగా ఎబోలా వైరస్‌ను గుర్తించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ వైరస్ 17 సార్లు వ్యాప్తి చెందినట్లు తెలిపింది. ప్రాథమిక శాంపిల్స్‌లో అధిక పాజిటివిటీ రేటు ఉందని.. వైరస్‌కు గురవుతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పేర్కొంది. 

Also Read: రాహుల్, ప్రియాంక వాయనాడ్‌ను మర్చిపోండి.. కాంగ్రెస్‌లో పోస్టర్ల కలకలం!

అయితే ఎబోలా వైరస్‌కు ఇప్పటిదాకా ప్రత్యేకమైన చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. అందుకే ఈ వైరస్‌ను అరికట్టడం అసాధ్యమని WHO ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని.. సరిహద్దుల వెంట స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేసింది. అలాగే వైరస్‌ భయంతో సరిహద్దులు మూసివేయద్దని.. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ఇక ఎబోలా వైరస్‌ లక్షణాలు ఉన్నవాళ్లు ఇతర దేశాలకు వెళ్లొద్దని చెప్పింది. వ్యాధి నిర్ధరణ అయినవాళ్లను క్వారంటైన్‌లో ఉంటాలని.. వాళ్లతో సంబంధం ఉన్నవాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచనలు చేసింది.