Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Telangana: బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి.. కేటీఆర్ సంచలన డిమాండ్

KTR Sensational comments on bandi sanjay
KTR Sensational comments on bandi sanjay

కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో నిర్వహించిన ‘నా బూత్‌-నా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ BLAలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

Also Read: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..

రాష్ట్రంలో ఒక బాలికకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీ చేతులు కలిపి బాధితురాలికి అన్యాయం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో గట్టిగా ఉండి పోరాడటం వల్లే ఈరోజు బాధితురాలికి కొంతవరకైనా న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అనే నినాదాలు మాటలకే పరిమితమైతే సరిపోదని.. ఆచరణలో కూడా న్యాయం జరగాలంటూ హితవు పలికారు.

Also Read: ఎబోలా వైరస్‌ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

కేంద్రమంత్రి కొడుకుపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే కేసు తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. బండి సంజయ్‌ పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదన్నారు. తప్పు చేసిన వ్యక్తిని తొమ్మిది రోజులు ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి.. బాధితురాలి తల్లిదండ్రులను భయపెట్టింది స్వయంగా కేంద్రమంత్రేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉంటే ఒక్క తెలంగాణకే కాదని.. దేశానికే అవమానకరమని విమర్శించారు. అందుకే బండి సంజయ్ కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.