Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Amit Shah: బండి సంజయ్ కు బిగ్ షాక్.. అమిత్ షా చేతిలో భగీరథ్ రిపోర్ట్.. అసలేం జరుగుతోంది?

home minister asks Bandi bhagirath case report
home minister asks Bandi bhagirath case report

Bandi Bhagirath Case Report Into Amit Shah’s Hand

బండి సంజయ్(Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్‌(Bandi Bhagirath) ను పోక్సో కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి.. బండి భగీరథ్‌ కేసుకు సంబంధించిన రిపోర్టు గురించి అడిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా.. అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి అమిత్ షాకు ఆయన నివేదిక ఇచ్చారు.   

ఈ క్రమంలోనే బండి భగీరథ్‌కు సంబంధించిన వ్యవహారంపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్లు తరచూ ఆయా రాష్ట్రాల పరిస్థితులకు సంబంధించిన రిపోర్ట్‌లను కేంద్ర హోం శాఖకు ఇస్తుంటారు . ఈసారి తెలంగాణ గవర్నర్ ఇచ్చిన రిపోర్టులో బండి భగీరథ్ అంశం కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read :  తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Also Read :  తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..