Train :  బంద్రా-గంగానగర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో సీటు వివాదం కారణంగా ఒక మహిళా మోడల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిపై, టికెట్ కలెక్టర్ పై దాడికి పాల్పడింది. థానేకు చెందిన 31 ఏళ్ల మోడల్ అంతరా సోహం బెనర్జీ ఆగస్టు 12న బంద్రా-గంగానగర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో సూరత్‌కు ప్రయాణిస్తున్నారు. ఆమె కూర్చున్న రిజర్వ్‌డ్ సీటును ఖాళీ చేయాలని ఒక తోటి ప్రయాణికుడు కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆ ప్రయాణికుడు జోక్యం చేసుకుని RPF సిబ్బందిని, టికెట్ కలెక్టర్‌ను పిలిపించాడు.

Also Read : శివాలయంలో తొక్కిసలాట: ఏడుగురు భక్తులు మృతి, పలువురికి గాయాలు!

ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, ఆ మోడల్ తన బట్టలు విప్పేసి, ఒక రేజర్ బ్లేడ్‌తో RPF అధికారి యమిని కాంత్ మిశ్రా, టికెట్ కలెక్టర్ హరికేష్ త్రిపాఠిలపై అలాగే తనపై తాను దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. RPF ఫిర్యాదు ప్రకారం, ఈ గొడవ సమయంలో ఆ మోడల్ వారి మొబైల్ ఫోన్‌లను కూడా పగలగొట్టింది.

రైలు దహను రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆమెను జీఆర్పీ అప్పగించారు. ఆగస్టు 13న బోరివలి రైల్వే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయగా, ఆ తర్వాత ఆమె బెయిైల్‌పై విడుదలయ్యారు. మరోవైపు, నటి అంతరా బెనర్జీ బృందం స్పందిస్తూ.. ఆ నిందితురాలు, తాము వేర్వేరు వ్యక్తులమని స్ప చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read : ర్యాపిడో బైక్ పైనుంచి దూకేసిన యువతి: ఢిల్లీలో దారుణం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.