
SIR : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) (SIR) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంబంధింత వివరాలను సుదర్శన్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా అనుమానస్పద ఓటర్ల జాబితాలో ఉన్న 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామని వివరించారు. ఇక ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
సంబంధిత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ ఇలా..?
ECI EPIC Number టైప్ చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపించాలి. కొన్ని సెకన్లలోనే మీకు ఈసీ నుంచి రిప్లై వస్తుంది. అందులో మీ పేరు, ఓటర్ కార్డు నెంబర్, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ పేరు వంటివి వస్తాయి. ఈ వివరాలు వస్తే మీ పేరు ఎస్ఐఆర్లో నమోదైనట్లు. ఒకవేళ ఎలాంటి వివరాలు కనిపించకపోతే వెంటనే మీ బీఎల్ఓను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : 90 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల కమిషనర్ సంచలన ప్రకటన
వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోండిలా…
https://voters.eci.gov.in/enumerationformnew పోర్టల్‌లోకి వెళ్లాలి
ముందుగా -మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి
ఆ తర్వాత -మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి
-అనంతరం ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
-ఆ తర్వాత మళ్లీ మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి
-అక్కడ మీ రాష్ర్టం, ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి
-యువర్ ఫాం హాజ్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వస్తే మీ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
-ఒకవేళ పెండింగ్‌లో ఉంటే బీఎల్వో పేరు, మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. వారిని సంప్రదించి మళ్లీ పేరు నమోదు చేసుకోవాలి.
మొబైల్ యాప్ ద్వారా ఓటర్ లిస్టును ఇలా పొందండి
దీనికోసం ముందుగా Citizen Service Portal ఓపెన్ చేయాలి
తెలంగాణ అందులో 2026 అని వస్తుంది. sir draft roll ను ఎంపిక చేసుకుని జిల్లాను ఎంచుకోవాలి. ఆ తర్వాత నియోజకవర్గాన్ని, ఆ తర్వాత లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకుని క్యాప్చా ఎంటర్ చేయాలి. అనంతరం డౌన్ లోడ్ మన ఓటింగ్ కేంద్రానికి సంబంధించిన లిస్టు వస్తుంది. అందులో మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి.
Also Read : మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఓటు కోల్పోతే ఏం చేయాలి..?
ఇక మీరు వివిధ కారణాల వల్ల ఎస్ఐఆర్ పూర్తి చేయలేకపోతే మీ ఓటు తొలగిస్తారు. అలా అని పూర్తిగా తొలగించినట్లు కాదు. మీరు మళ్లీ కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలి. మీ వివరాలను ఈసీ పరిశీలిస్తుంది. అన్ని సరిగా ఉన్నాయనుకుంటే కొత్త ఓటర్ ఐడీ జారీ చేస్తోంది. దీంతో ఎస్ఐఆర్లో పాల్గొనకపోతే మీ ఓటు పోయినట్లు లెక్క కాదు. మళ్లీ దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. కానీ మళ్లీ దరఖాస్తు చేసుకుని ఐడీ పొందేందుకు చాలా సమయం పడుతుంది.









