Horoscope 2026 Today
Horoscope 2026 Today

మేషం
ముఖ్యమైన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. నిగ్రహంతో ముందడుగు వేస్తే ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి.

వృషభం
అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. బంధుమిత్రులతో అనుబంధం బలపడుతుంది.

మిథునం
మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండండి.

కర్కాటకం
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే సమస్యలు ఉండవు.

సింహం
గురుబలం అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే అనుకున్నది సాధిస్తారు. కాస్త అధిక శ్రమ ఉన్నప్పటికీ ఫలితం సంతృప్తినిస్తుంది.

కన్య
అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. నమ్మకమైన మిత్రుల సహకారం అందుతుంది. నిర్ణయాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి.

Also Read : తమిళనాడుకు నీటి విడుదల ఆదేశాలను పాటించాల్సిందే… కర్ణాటకను ఆదేశించిన సుప్రీంకోర్టు

తుల
మంచి వార్తలు ఉత్సాహాన్ని నింపుతాయి. అధికారుల మద్దతుతో ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ధన నిర్వహణలో విచక్షణ పాటించాలి.

వృశ్చికం
శుభకార్యాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు మానసిక బలాన్నిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

ధనుస్సు
గురుబలం వల్ల చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంతో సవాళ్లను స్వీకరిస్తే విజయం లభిస్తుంది. ఓర్పు, సంయమనం ముఖ్యం.

మకరం
ఆశించిన నూతన సమాచారం అందుతుంది. కీలక వ్యవహారాల్లో మీ చురుకుదనం పేరుప్రఖ్యాతులను పెంచుతుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

కుంభం
మనశ్శాంతి లభిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం
కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ధైర్యాన్నిస్తాయి. బంధుమిత్రులతో సమయం గడపడం సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రతతో కృషి చేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

Also Read : ఆటో డ్రైవర్ ఇంట్లో సంచుల కొద్దీ డబ్బులు… ఐదుగంటలు లెక్కించగా తేలిందేంటంటే?