Donald Trump
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆయనకు ఉన్న ప్రజాదరణ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రజల్లో కేవలం 33 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరును సమర్థిస్తున్నారు. మిగిలిన 64 శాతం మంది నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. ట్రంప్ పదవీకాలంలో తను పొందిన అతి తక్కువ ఆమోద రేటింగ్ కూడా ఇదే.

ట్రంప్‌కు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఇరాన్‌తో నెలకొన్న సైనిక వివాదం, దానివల్ల తలెత్తిన ఆర్థిక పరిణామాలేనని విశ్లేషణలు అంటున్నారు. గత అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానని.. అమెరికాను సుదీర్ఘమైన విదేశీ యుద్ధాలలోకి దింపనని ట్రంప్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు ఆదేశించడంతో అతను మాట తప్పారనే భావన చాలా మందిలో ఉంది.

Also Read : 17 సార్లు లేట్.. మనిషిని ఉద్యోగం నుంచి తీసేసిన AI!

ఈ సైనిక పోరాటం కారణంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. అంతర్జాతీయంగా చమురు వ్యాపారంలో ఐదవ వంతు నిలిచిపోవడంతో అమెరికాలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంధన ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి సాధారణ కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర భారం పడింది. మొదట్లో ఇరాన్‌తో యుద్ధం కొద్ది వారాల్లోనే ముగుస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది.

ఈ యుద్ధం ముగింపు లేని సుదీర్ఘ పోరాటంగా మారవచ్చని అమెరికన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 80 శాతం మంది, అందులో 87 శాతం డెమొక్రాట్లు, 71 శాతం రిపబ్లికన్లు ఉన్నారు. అయితే ఈ గొడవ చాలా కాలం నుంచి సాగుతుందని అంటున్నారు. కేవలం 16 శాతం మంది మాత్రమే కొన్ని వారాల్లోనే శాంతి నెలకొంటుందని భావిస్తున్నారు. సొంత పార్టీ సభ్యుల్లో కూడా ఈ స్థాయిలో భయాందోళనలు వ్యక్తమవ్వడం ట్రంప్‌కు రాజకీయంగా వ్యతిరేకత ఏర్పడింది. అయితే నవంబరులో రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఈ పరిణామాలు రిపబ్లికన్ పార్టీకి సవాలుగా మారాయి.

Also Read : రష్యాపై ఉక్రెయిన్ భీకరదాడి.. ఒకేసారి వెయ్యి డ్రోన్లతో…