
Eshwar Sai : బాసింగ బలాలు పాటతో నెట్టింట మంచి పేరు తెచ్చుకున్న యూట్యూబ్ నటుడు ఈశ్వర్ సాయి రాసలీలలు బయటపడ్డాయి. పెళ్లై, ఒక పిల్లాడు ఉన్నప్పటికీ ఈశ్వర్ సాయి.. తోటి జానపద నటి మాధురి రాథోడ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. వీరిద్దరూ వేములవాడలోని రెడ్డి భవన్లో కలిసి ఉండగా, ఈశ్వర్ సాయి భార్య పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని వారిని నేరుగా పట్టుకుంది.
పాటల రికార్డింగ్, షూటింగ్‌ల పేరుతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగిందని, అది కాస్తా తప్పుదోవ పట్టడంతో భార్యకు అనుమానం వచ్చిందని తెలుస్తోంది. వేములవాడలో వీరిద్దరూ ఉన్నారని తెలుసుకుని వెళ్లిన భార్య, అక్కడే వారిని గట్టిగా నిలదీసింది. ఈ క్రమంలో అక్కడ పెద్ద గొడవైంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన చూసిన నెటిజన్లు ఈశ్వర్ సాయి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈశ్వర్ సాయి భార్య సంచలన విషయాలను బయటపెట్టింది. “మాకు పెళ్లై 7 సంవత్సరాలు అవుతోంది. మాకో బాబు కూడా ఉన్నాడు. నా భర్త చాలా మంచివాడు, ఆయనకు కనీసం మందు తాగే అలవాటు కూడా లేదు. కానీ ఈ అమ్మాయే ఆయనపై పడి లొంగదీసుకుందని ఆమె ఆరోపించారు. గతంలో ఆ నటికి బ్రేకప్ అయినప్పుడు తానే దగ్గరుండి ఓదార్చానని, తన కళ్ల ముందే ఉంటూ మంచిదానిలా నటిస్తూనే వెన్నుపోటు పొడుస్తుందని అనుకోలేదని వాపోయారు. వారిద్దరి మధ్య ఉన్న వాట్సాప్ మెసేజ్‌లు చూశాకే అసలు విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.
నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది
మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు
ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను
నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు
నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/dAaYN5Qka7
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
తన పక్కనే ఉంటూ ఇలాంటి మోసానికి పాల్పడటాన్ని తట్టుకోలేక, ఒకానొక దశలో తన కుమారుడితో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా ఈశ్వర్ సాయి హీరో పాత్రలో వచ్చిన చాలా ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో.., సీటి సీర, లాయి లాయి లబ్బరు బొమ్మ పాటలకు భారీగా వ్యూవ్స్ వచ్చాయి. ఇటీవల వచ్చిన బాసిట బాసిట బాణాలే పాట యూట్యూబ్ నే షేక్ చేసింది.









