
కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ సిమ్ కార్డు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలను అరికట్టేందుకు ఆగస్టు 24 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తోంది. దాని ప్రకారం.. కొత్త సిమ్ కొనుక్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్ధిష్ట సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్నవారికి కంపెనీలు ఇకపై కొత్త సిమ్ కార్టులను జారీ చేవు. ఇంతకీ ఆ కొత్త నిబంధనలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : రాముడి రూపంలో పీఎం కటౌట్ : ఢిల్లీలో మోదీ చాలీసా పారాయణం!
కొత్త నిబంధనలు
ఆగస్టు 24 నుండి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి పేరు మీద అనుమతి కంటే ఎక్కువ సిమ్ కార్డులు (Jio, Airtel, Vi, BSNL మొదలైనవి) ఉంటే.. అలాంటి వారికి టెలికాం కంపెనీలు ఇకపై కొత్త సిమ్ కార్డులు జారీ చేయవు. వీటికోసం టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి సంబంధించిన ‘‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫారమ్’’ ద్వారా కస్టమర్ల డేటాను పరిశీలించి.. పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే.. వారి అభ్యర్థనను నిరాకరిస్తాయి.
ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్‌లు ఉండొచ్చు..?
ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు ద్వారా మొత్తం 9 సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ నియమం దేశంలోని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా కారణాల దృష్ట్యా గరిష్టంగా 6 సిమ్ కనెక్షన్‌లకు మాత్రమే అనుమతి ఉంది.
మీ పేరుమీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి..
ఒకప్పుడు ఒకరి గుర్తింపు కార్డుతో చాలా సిమ్ కార్డులు తీసుకునే వారు. చాలా మంది మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డుతో సిమ్ తీసుకునేవారు. దీని వల్ల మనం చేయని తప్పుకు.. శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల మన పేరు మీద ఎవరైనా సిమ్ తీసుకున్నారా? లేదా?.. అలాగే మన పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రీ సర్వీసు అందిస్తోంది.
సంచార్ సాథీ అధికారిక వెబ్‌సైట్ sancharsaathi.gov.in, TAFCOP పోర్టల్‌ను సందర్శించాలి. అందులో క్యాప్చా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు తెలియని నెంబర్స్ ఉంటే.. వాటిని బ్లాక్ కూడా చేసుకోవచ్చు.
Also Read : గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ… దేశంలో వెయ్యి శాఖలు..
తెలియని నెంబర్‌ను ఎలా బ్లాక్ చేయాలి..?
పోర్టల్‌లో చెకింగ్ చేసిన తర్వాత మీకు తెలియని నెంబర్స్ కనిపిస్తే వాటిని ‘‘This is not my number’’ (ఇది నా నంబర్ కాదు) లేదా ‘‘Not required’’ (నాకు అవసరం లేదు) అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రిపోర్టు చేయవచ్చు. టెలికాం కంపెనీలు ఆ రిపోర్టు ఆధారంగా సదరు సిమ్ కార్డును డియాక్టివేట్ చేస్తాయి.









