
Anasuya Bharadwaj : సామాజిక మాధ్యమాలలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే నటి అనసూయ కీలక అంశం పై చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె భావోద్వేగంతో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తండ్రి మరణానంతరం తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులను చూసి తాను మూడేళ్లుగా మథనపడుతున్నట్లు అందులో పేర్కొ్న్నారు. భర్త చనిపోతే మహిళలు బొట్టు, గాజులు తీసేయాలనే ఆచారంపై ఆమె పలు ప్రశ్నలు సంధించారు.
Also Read : తాప్సీతో పాత గొడవ.. కంగనా సంచలన పోస్ట్!
‘‘మూడేళ్లుగా ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మా నాన్న మూడేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి మా జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. మా అమ్మ ముస్తాబైతే చాలా అందంగా ఉండేది. చక్కగా బొట్టు, కాటుక, రంగురంగుల గాజులు, గజ్జెలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉండేది. కానీ, నాన్న చనిపోయాక సమాజంలోని మాటల వల్ల ఆమె వాటన్నింటికీ దూరమైంది. ఆ పరిస్థితులు నాకు కష్టంగా అనిపించాయి. ముఖ్యంగా ఆడపిల్లలు నా బాధను అర్థం చేసుకోవాలి. నన్ను వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే. ఆడపిల్లలకు బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు వంటివి పెళ్లికి ముందే వాళ్ల అమ్మ, అమ్మమ్మలు పరిచయం చేస్తారు కదా. అలాంటప్పుడు వీటికి భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారు?’’ అంటూ ఆమె ప్రశ్నించింది.
‘‘నా దృష్టిలో చెప్పాలంటే.. ఈ అలంకరణను పరిచయం చేసిన అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా వాటిని వదులుకోవాలి అంటూ తెలిపింది. బొట్టు, గాజులు వేసుకోవడం అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత ఇష్టం కదా? అంటూ ప్రశ్నించింది. ఏవైనా పూజలు, శుభకార్యాలు జరిగినప్పుడు కూడా కొన్ని బలవంతపు రూల్స్ నాకింకా కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎక్కడ రాసి ఉన్నాయి? నేను ఎవరినీ ఉద్దేశించి, ఎవరికీ వ్యతిరేకంగా ఈ మాటలు అనడం లేదు. నాలో మెదిలిన ఒక సందేహాన్ని మాత్రమే మీ అందరితో పంచుకుంటున్నాను’’ అని అనసూయ తన మనసులోని భావాలను వ్యక్తపరచడం వైరల్గా మారాయి.
Also Read : అయ్యప్ప మాలలో రవితేజ విశ్వరూపం.. ఇరుముడి బ్లాక్బస్టర్ టాక్!









