ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ఎస్ఈసీ విడుదల చేసింది.  10 నగర పంచాయతీ,77 మున్సిపాలిటీ,13 కార్పొరేషన్లకు షెడ్యూల్ ప్రకటించింది. మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించి.. 30న ఫలితాలను ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 18న ఆఖరు తేదీ కాగా.. 19న పరిశీలించనున్నారు. 21న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 5న ఫలితాలు విడుదల చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. 26న తొలి దశ, 29న 2వ దశ, డిసెంబర్ 2న 3వ దశ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రోజే సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.