Tirumala
Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. వసతి గదుల విషయంలో ఇంతకు ముందు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. ఈ కష్టాలకు చెక్ పెడుతూనే టీటీడీ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు వేగంగా గదులు కేటాయించేలా టీటీడీ ప్లాన్ చేసింది. పాత విధానంలో రూమ్ కేటాయింపు విషయంలో ఉన్న లోపాలను సరిదిద్ది.. భక్తులకు ఈజీగా వసతి లభించేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.

కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 5 గంటల నుంచే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు ఒరిజినల్ లేదా జిరాక్స్ ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. అలాగే ఉపయోగించే మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అక్కడ ఫేస్ రికగ్నిషన్ ద్వారా డిటైల్స్ ఎంటర్ చేస్తారు. అప్పుడు భక్తులు వారి ఆర్థిక స్తోమతను బట్టి రూ.50, రూ.100 లేదా రూ.1000 కేటగిరీల్లో ఉన్న రూమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. సీఆర్వోలోని డిస్ప్లే బోర్డుపై లైన్ ప్రకారం కేవలం 15 నిమిషాల్లోనే భక్తుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ డిటైల్స్ రాకపోతే కియోస్క్ వద్ద స్లిప్ స్కాన్ చేసి డిటైల్స్ తెలుసుకోవచ్చు.

Also Read : కొత్తగా వస్తున్న కరోనాకు పాత వ్యాక్సిన్ పని చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

అలాగే పేమెంట్ విధానంలో కూడా టీటీడీ మార్పులు చేసింది. గతంలో రూమ్ బుకింగ్, అడ్వాన్స్ చెల్లింపులు అన్నీ సీఆర్వో కౌంటర్ వద్దే జరిగేవి. కానీ ఇప్పుడు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయాల వద్దే నగదు రహితంగా పేమెంట్ చేసి తాళాలు తీసుకోవాలి. అంజనాద్రి నగర్, శేషాద్రి నగర్, శంఖుమిట్ట, గరుడాద్రి నగర్, హిల్ వ్యూ కాటేజీలు, సుదర్శన, గోవర్ధన్, కళ్యాణి సత్రాలు, సప్తగిరి, వరాహస్వామి, పాంచజన్యం, మాతృశ్రీ వకుళామాత ప్రాంతాల్లోని కార్యాలయాల ద్వారా గదులు ఇస్తారు. పాత విధానంలో రూమ్ ఖాళీ చేసిన 24 నుంచి 48 గంటలకు డిపాజిట్ డబ్బులు వెనక్కి వచ్చేవి. కానీ తాజా విధానంలో కేవలం 3 నుంచి 4 గంటల్లోనే భక్తుల ఖాతాల్లో డిపాజిట్ నగదు క్రెడిట్ అవుతుంది.

గతంలో మొబైల్‌కు ఎస్ఎంఎస్ వచ్చే సౌకర్యం లేదు. అలాగే 30 రోజుల పరిమితి నిబంధన కూడా ఉండేది కాదు. కానీ కొత్త రూల్స్ ప్రకారం.. గది పొందాలంటే భక్తులకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఒకసారి వసతి పొందిన వారు మళ్లీ గది తీసుకోవాలంటే తప్పకుండా 30 రోజులు ఆగాల్సిందే. దళారుల బెడదను అరికట్టేందుకు ఒంటరి వ్యక్తులకు, అవివాహితులకు గదులు కేటాయించరు. క్యూ లైన్లలో నిల్చునేందుకు ఓ కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది. గదుల కేటాయింపు కేవలం 24 గంటల పాటు మాత్రమే ఉంటుంది. గడువు దాటితే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. భక్తులు తమకు కేటాయించిన గదిని వేరే వ్యక్తులకు బదిలీ చేయకూడదు.

Also Read : పి.వి సింధూ విజయంపై సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రశంసల వర్షం..