madanapalle

Madanapalle :  భర్త కష్టపడి పనికి వెళ్తే.. భార్య మాత్రం ప్రియుడితో ఇంట్లో ఏకాంతంగా గడిపింది. అనుమానం వచ్చిన భర్త పక్కా ప్లాన్‌తో వచ్చి ఇద్దరినీ మంచంపైనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. గది బయట నుంచి తాళం వేసి పోలీసులకు పట్టించిన ఈ వింత ఘటన మదనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపింది.

అన్నమయ్య జిల్లా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఒక కాలనీలో ఓ కాంట్రాక్టర్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతని భార్యకు ఒక డిష్ ఆఫీస్‌లో బిల్ కలెక్టర్‌గా పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర బంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఆమె రోజు ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. ఆదివారం కూడా భర్త పనికి వెళ్లాడనుకుని, ప్రియుడిని రూమ్‌లోకి రప్పించింది.

భార్య ప్రవర్తనపై ఎప్పటి నుంచో నిఘా పెట్టిన భర్త.. ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని కాపు కాశాడు. అనుకున్నట్టుగానే అకస్మాత్తుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెడ్‌రూమ్‌లో భార్య, ప్రియుడు కలిసి ఉండటాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే తేరుకుని, గది బయట నుంచి గడియ పెట్టి, ఇంటికి తాళం వేశాడు. ఆ తర్వాత మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read : శ్రీకాకుళం జిల్లాలో ఘోరం: ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మహిళలు దుర్మరణం

షాకింగ్ కామెంట్

పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని నిలదీయగా.. ఆ భార్య ఏమాత్రం భయం, సిగ్గు లేకుండా అందరి ముందూ షాకింగ్ కామెంట్ చేసింది. “కావాలంటే నా మొగుణ్ణి వదిలేస్తాను కానీ, నా ప్రియుడిని మాత్రం వదలను” అంటూ తెగేసి చెప్పింది. దీంతో కోపం తట్టుకోలేకపోయిన భర్త, స్థానికులు కలిసి భార్య ముందే ప్రియుడికి తల పగిలేలా దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ వింత వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బట్టగుండుతో 40 మంది మహిళలకు వల… నిత్య పెళ్లికొడుకు అరెస్టు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.