
Mysuru : కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హున్సూర్ పట్టణంలోని న్యూ మారుతి లేఅవుట్లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుటుంబం హరీశ్ (49), అతని భార్య నిశ్చిత (36), వారి కుమార్తెలు నెక్షా (13), రక్ష (6) లుగా గుర్తించారు.
హరీశ్ తన భార్య, కుమార్తెల నోళ్లకు అడెసివ్ టేప్ అంటించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని ఆరోపించబడింది. ఆ తర్వాత అతను ఆ ఇంటి మొదటి అంతస్తులోని ఒక గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఒక సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఆ నోట్ పైన నేను పై గదిలో ఉరివేసుకుంటున్నాను అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి, దాని కింద నా చివరి కోరికలు అనే హెడ్డింగ్ ఉంది. దాని క్రింద ఆ వ్యక్తి అనేక అభ్యర్థనలను జాబితా చేశాడు. కుటుంబంతో కలిసి ఉంటున్న హరీష్ తల్లిని మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి పంపించారు.
Mysuru, Karnataka | A man, Harish (40) allegedly killed his wife and two children and then died by suicide by hanging. The incident took place in New Maruti Layout, Hunsur City. The wife and children lived in the same house. Harish had sent his mother to his grandmother's house…
— ANI (@ANI) July 21, 2026
ఆస్తులను జప్తు
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతసేపటి వరకు ఇంటి తలుపు మూసి ఉండటంతో, మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు. బంధువుల సమాచారం ప్రకారం అతని రెండు ఆస్తులను ఇటీవల బ్యాంకులు జప్తు చేశాయని పోలీసులు గుర్తించారు. హున్సూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.









