అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ గల్లీల నేపథ్యంలోని ముగ్గురు స్నేహితుల కథ, వారి ప్రయాణం, యూత్‌కి ఇచ్చే సందేశంతో ఇదొక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘అవ్వల్ దావత్’ సాంగ్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలోని వైవిధ్యమైన కంటెంట్ నచ్చడంతో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ ఎత్తున విడుదల చేసేందుకు స్పిరిట్ మీడియా సన్నాహాలు చేస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతోంది.

నటీనటులు:
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు.

సాంకేతిక బృందం:
దర్శకుడు: రమణ రెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచూరి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
ఛాయాగ్రాహకుడు (DoP): ఎస్‌వీకే (SVK)
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్స్ డిజైన్: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బొరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
పీఆర్‌వో: సాయి సతీష్