Nara Rohith
Nara Rohith

టాలీవుడ్ ప్రముఖ నటుడు నారా రోహిత్ తండ్రయ్యారు. ఆయన భార్య శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. నారా రోహిత్ తండ్రి కావడంతో వీరి ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడని ఆనంద పడుతున్నారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: తెలంగాణ ఉద్యమకారుడు, సినీ నిర్మాత పద్మారావు కన్నుమూత!

నారా రోహిత్ బాణం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన నటన, డిఫరెంట్ స్టోరీస్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మధ్యలో కొన్నాళ్ల పాటు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. అయితే నారా రోహిత్ లీడ్ రోల్ పోషించిన ‘ప్రతినిధి 2’ చిత్రంలో అతని భార్య శిరీష హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల ఇష్టంతో గతేడాది వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికే బిడ్డ పుట్టడంతో కుటంబ సభ్యులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

Also Read : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్…180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్