
కాకినాడ పోర్టులో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ గాయపడినట్లు. తెలుస్తోంది. మోకాలికి దెబ్బతగలడంతో చిత్రబృందం దగ్గరలోని ఆసుపత్రిలో తరలించినట్లు సమాచారం. బాలయ్యను పరీక్షించిన వైద్యులు ఆయన మోకాలికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారట. స్కానింగ్ కి సంబంధించిన రిపోర్స్ ఇంకా రావాల్సి ఉంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
1993 ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయం సాధించింది. దీంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే NBK111 ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : బాలయ్యకు గాయం : ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు.. NTR సంచలన ట్వీట్!
–> హీరో నందమూరి బాలకృష్ణకు ప్రమాదం
–> షూటింగ్ లో జారిపడ్డ బాలయ్య
–> మోకాలికి గాయం?.. పరీక్షలు చేస్తున్న వైద్యులు
–> కాకినాడ పోర్ట్ లో బాలయ్య-గోపిచంద్ మలినేని సినిమా షూటింగ్#NBK #NBK111 pic.twitter.com/Vif2SWhiMH
— RTV (@RTVnewsnetwork) July 21, 2026
ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ కి పోస్టుపోన్ చేశారు. ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో మూవీ చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య కాలికి గాయమవడంతో షూటింగ్ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో, యంగ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : మెగాస్టార్ చిరు హీరోయిన్.. 100 కేజీల బరువుతో సతమతం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి..!









