
Ilaiyaraaja : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో ఆయన 50 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని గుర్తిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక స్మారక స్టాంప్‌ను విడుదల చేసి గౌరవించారు.
Also Read : పెళ్లి కాకపోయినా పర్లేదు.. తల్లి కావాలని ఉంది: శ్రుతి హాసన్ సంచలన కామెంట్స్!
తమిళనాడులోని ఓ చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో గౌరవం అందుకోవడం ఎంతో సంతోషంగా, భావోద్వేగంగా ఉందని ఇళయరాజా తెలిపారు. ఈ గౌరవం అందించిన విక్టోరియా ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగన్‌తో పాటు ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యులకు ఇళయరాజా కృతజ్ఞతలు తెలిపారు. తన సంగీత ప్రయాణంలో తనతో కలిసి పనిచేసిన కళాకారులు, తన సంగీతానికి ప్రాణం పోసిన ఎంతోమంది, అలాగే తరతరాలుగా తన పాటలను ఆదరిస్తున్న శ్రోతలకు కూడా ఇళయరాజా ధన్యవాదాలు తెలిపారు.
సినీ పరిశ్రమలో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన పలు దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. జూలైలో ప్రారంభమైన ఆయన గోల్డెన్ జూబ్లీ టూర్‌లో భాగంగా ఇప్పటికే ఉత్తర అమెరికాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26న సిడ్నీలో, అక్టోబర్ 5న బ్రిస్బేన్‌లో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఇళయరాజాను ఘనంగా సన్మానించింది. ఇక ఇళయరాజా సంగీతం అందించిన డొరోతి సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read : వెల్‌కమ్ బేబీ గర్ల్.. దీపిక, రణ్‌వీర్ ఇంట్లోకి మరో మహాలక్ష్మి!









