Indian 3 :  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా భారతీయుడు 3. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు కి కొనసాగింపుగా భారతీయుడు 2, భారతీయుడు 3 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భారతీయుడు 2 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు భారతీయుడు 3ని పూర్తి చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు.

భారతీయుడు 3లో ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఆ సీన్ల ఎడిటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన షూటింగ్‌ను మరో 10 రోజుల్లో మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళ్తుండగా.. చుట్టూ దుమ్ము, దూళి రేగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. భారతీయుడు 3లో ఏం జరగబోతోందో భారతీయుడు 2 క్లైమాక్స్‌లోనే కొంత చూపించారు.

ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసారి సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటమే భారతీయుడు 3లో ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కథను శంకర్ మరింత భారీగా తెరకెక్కించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ భారీ చిత్రాలతో పాటు కొత్త కథలను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. 2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ సినిమాలను నిర్మించిన లైకా.. ఇప్పుడు భారతీయుడు 3ని కూడా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. భారీ బడ్జెట్, మంచి టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటు ఎస్.జే.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, పియూష్ మిశ్రా, గురు సోమసుందరం తదితరులు నటిస్తున్నారు.

Also Read : రోజుకు 60 సిగరెట్లు, 56 ఏళ్లకే గుడ్‌బై.. నానా పటేకర్ జీవితంలో హెల్త్ లెసన్!

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌
స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌
మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌
ఆర్ట్‌: ముత్తురాజ్‌
స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ
డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌
కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌
పాట‌లు: శ్రీమ‌ణి
సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌
మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, అబ్దుల్ ఏ ఆర్
కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య
పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్
హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌

Also Read : సెల్ఫీ కోసం వచ్చాడు.. బుగ్గ గిల్లి వెళ్లాడు…హీరోయిన్ కు ఊహించని షాక్‌!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.