Irumudi :  మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా ఇరుముడి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు పూర్తి చేసుకుని సోషల్ మీడియాలో చాలా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. డివొషనల్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, థ్రిల్లింగ్ఎలిమెంట్స్ కలిగించే క్రైమ్ అంశాలతో వచ్చిన ఈ సినిమాపై నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు.

ఇంతకు కథ ఏంటంటే.. తాగుడికి బానిసై జీవితాన్ని పాడుచేసుకున్న ఒక తండ్రి, తన కూతురి ప్రేమను, పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందడానికి 41 రోజుల పాటు పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఊరికి, అమాయక ఆడపిల్లలకు ఒక పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. ఆ స్వామి మాల నియమాలు పాటిస్తూనే, ఆ ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని, ఊరిని అతడు ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమా కథ.

ఫస్ట్ హఫ్ ఎలాంటి హడావుడి లేకుండా మలయాళ సినిమాల తరహాలో ఎంతో సహజంగా సాగుతుందని నెటిజన్లు చెబుతున్నారు. తండ్రీకూతుళ్ల బంధం, స్కూల్ చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కథ కాస్త నెమ్మదించినా, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు సెకండాఫ్‌పై బాగా ఆసక్తిని పెంచుతాయి.

Also Read : సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…20 శాతం సంక్షేమానికి ఇవ్వాల్సిందే

రెండో భాగంలో ఎమోషన్స్ పీక్స్‌కి వెళ్తాయి. మల్లెపూల పల్లకి పాట వెనుక వచ్చే యాక్షన్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు విపరీతమైన గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. కథలో ట్విస్ట్ రివీల్ అయ్యాక అక్కడక్కడా కాస్త పట్టు సడలినట్లు అనిపించినా, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లు మాత్రం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెంకడ్ హాఫ్ కాస్త తగ్గిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయ్యప్ప స్వామి మాలలో రవితేజ నటన ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ అంటున్నారు.  పాపగా నటించిన బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చే సీన్లు గుండెకు హత్తుకుంటాయి. నటుడు సాయికుమార్ చెప్పే డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. నటి స్వాసిక కూడా తన పాత్రలో బాగా చేసింది.

జీవీ ప్రకాష్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. గ్రామీణ అందాలను కెమెరాలో చాలా సహజంగా చూపించారు. అక్కడక్కడా చిన్నపాటి లాజిక్ లోపాలు, నెమ్మదించిన కథనం మినహాయిస్తే.. బలమైన కథ, రవితేజ అద్భుతమైన నటన, అదిరిపోయే క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు.

మొత్తానికి రవితేజ ఈ ఇరుముడి సినిమాతో చాలా కాలం తర్వాత గట్టిగా కొట్టారని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : విమల్ యాడ్: షారూఖ్, అజయ్ దేవ్‌గన్ లకు నోటీసులు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.