DNK Teaser
DNK Teaser

#90s వెబ్ సిరీస్, లిటిల్ హార్ట్స్ సినిమాతో నటుడు మౌళి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు వచ్చేస్తున్నాడు. మౌళి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘DNK’ (దొంగ నా కొడుకు). ఇందులో సుష్మితా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌ట్రైన్ చేస్తుంది. కామెడీ సీన్లు అయితే మరో లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. మౌళి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇందులో మౌళి.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన ఈశ్వర్ అనే కుర్రాడిగా కనిపించనున్నాడు. అతడి తండ్రిగా కమెడియన్ అలీ నటించాడు. మొత్తంగా మౌళి మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా.. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరెందుకు ఆలస్యం ఇప్పటికైతే.. ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేసేయండి.