
Peddi Collections : ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో ఊహించని ఒక ఇష్యూ నడుస్తోంది. అసలేంటా ఇష్యూ? ఒకపక్కేమో ‘పెద్ది’ సినిమా డిజాస్టర్, నిర్మాతలు లాస్ అయ్యారు, చరణ్ తన వంద కోట్ల రెమ్యూనరేషన్ వదిలేసుకున్నాడు అని ఒక టాక్ నడుస్తోంది, కట్ చేస్తే.. మరోపక్క ‘పెద్ది’ 400 కోట్లు కొల్లగొట్టింది, థియేటర్లలో సరికొత్త వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇస్తోంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్! అసలు ఏది నిజం? ఏది అబద్ధం? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఆ ‘సిక్స్ మినిట్స్’ సీక్రెట్ ఏంటి? ‘పెద్ది’ సినిమా వెనుక ఉన్న కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీని డిటైల్డ్ గా చేసేద్దాం..
“ఫస్ట్ అసలు టాపిక్ కొద్దాం.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక రూమర్ తెగ వైరల్ అవుతోంది. ‘పెద్ది’ సినిమా సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. అంటే దాదాపు 90 -100 Crores అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే, కొందరి వాదన ఏంటంటే.. సినిమా అనుకున్న రేంజ్ లో కమర్షియల్ గా ఆడకపోవడంతో, ఇన్వెస్టర్లు నష్టపోకూడదని మెగా పవర్ స్టార్ ఒక ‘గ్రేట్ డెసిషన్’ తీసుకున్నారట!
“సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది.. ఫ్లాప్ అయితే లాస్ నిర్మాతది.. ఇది కదా జనరల్ రూల్? కానీ ఇక్కడ ఉన్నది మెగా బ్లడ్! ‘కలెక్షన్స్ కంటే నిర్మాత క్షేమమే ముఖ్యం’ అని ప్రూవ్ చేసిన రియల్ హీరో రామ్ చరణ్!” ‘పెద్ది’ ప్రొడ్యూసర్స్ కు భారం తగ్గించడానికి చరణ్ తనకు రావాల్సిన బ్యాలెన్స్ పేమెంట్‌ను పూర్తిగా క్యాన్సిల్ చేయడమే కాకుండా.. ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ లో కూడా కొంత వెనక్కి ఇచ్చేసారట. 180 రోజులకు పైగా కాల్షీట్లు ఇచ్చి, రగ్గడ్ లుక్ కోసం బాడీని హూనం చేసుకున్నా.. సినిమాపై ఉన్న ప్రేమతో ఈ త్యాగం చేశారట.
Also Read: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. సంధ్యా థియేటర్ కేసులో కోర్టు సమన్లు జారీ
Peddi Collections
కానీ ఫిలిం నగర్ నుంచి వస్తున్న అఫీషియల్ అప్డేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ‘పెద్ది’ బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తోంది.. అసలు సిసలైన వేట ఇప్పుడే మొదలైంది! వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి అందించిన ఈ యాక్షన్ డ్రామా.. ఆల్రెడీ వరల్డ్‌వైడ్‌గా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది(Peddi Collections) అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు, ఇక సోషల్ మీడియాలో అయితే 2026 సౌత్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా ‘పెద్ది’ నిలిచిందంటూ ఫ్యాన్స్ రచ్చ లేపుతున్నారు.
మొత్తానికి చరణ్ సోలో హీరోగా కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రికార్డ్ ‘పెద్ది’ ఖాతాలో పడిపోయింది. థియేట్రికల్ రన్ అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడు మూడో వారంలోకి సరికొత్త హంగులతో అడుగుపెడుతోంది!”
Peddi Collections… 5 నిమిషాల 56 సెకన్ల కొత్త వెర్షన్
“ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయ్యాక లెంత్ ఎక్కువైతే సీన్లు కట్ చేయడం చూశాం. కానీ సినిమా హిట్టయ్యాక, ప్రేక్షకులకు ఎక్స్ట్రా విజువల్ ట్రీట్ ఇవ్వడానికి కొత్త సీన్లు యాడ్ చేయడం చాలా రేర్! ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇప్పుడు థియేటర్లలో సరికొత్త వెర్షన్‌ని రిలీజ్ చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే.. 5 నిమిషాల 56 సెకన్ల Additional Footage ని థియేటర్లలో యాడ్ చేశారు.
ఆ రెజ్లింగ్ ఎపిసోడ్స్, క్రికెట్ డ్రామా, ఇంకా చరణ్ మాస్ ఎలివేషన్ సీన్స్ ఈ కొత్త వెర్షన్లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు కూడా, ఆ 6 నిమిషాల కంటెంట్ కోసం మళ్ళీ థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు.
“కంటెంట్ మాత్రమే కాదు.. మేకర్స్ స్ట్రాటజీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ గురువారం నుండి ‘పెద్ది’ చిత్ర బృందం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ప్రైజ్ లను పూర్తిగా తగ్గించి, సాధారణ టికెట్ ధరలకే సినిమాను అందుబాటులోకి తెచ్చారు.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇప్పటివరకు థియేటర్ కి రాలేకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్లకు క్యూ కడతారు. టికెట్ రేట్లు తక్కువ ఉండడం.. సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేయడంతో ఇక బాక్సాఫీస్ దగ్గర మూడో వారం కూడా కలెక్షన్ల(Peddi Collections) వర్షం కురవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్”
“ఇక ‘పెద్ది’ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రముఖ OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కావడానికి లైన్ క్లియర్ చేసుకుంటుండగా.. మన గ్లోబల్ స్టార్ ఆల్రెడీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టేశారు. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రేజీ డైరెక్టర్ సుకుమార్ గారితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోతున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం చరణ్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఒక పక్క ‘పెద్ది’ రికార్డులు.. మరోపక్క సుకుమార్ తో కొత్త ప్రాజెక్ట్.. మెగా ఫ్యాన్స్ కి ఇది కదా అసలైన పండగ!”









