
Varanasi : మాస్ సినిమాల్లో భక్తి పాటలు కూడా ఒక్కోసారి థియేటర్లలో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకి పాట కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియోకు యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఓ కీలకమైన సందర్భంలో భక్తి పాటను ఉపయోగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read : సమంత సీమంతం.. ఇంతకు శ్రీవిద్య ఉపాసన అంటే ఏమిటి?
అందులో భాగంగా రఘుకుల తిలక రారా అనే పాటను వారణాసిలో పెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచి సిట్యువేషన్లో ఈ పాట వస్తుందని, కథకు తగ్గట్టుగా దీనిని ఉపయోగించబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రఘుకుల తిలక రారా పాట ఇప్పటికే భక్తి పాటగా శ్రోతలకు పరిచయమే. కొండల స్వామి పాడిన ఈ పాట 2025 మార్చిలో విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటివరకు భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు ఇదే పాటను మహేష్ బాబు-రాజమౌళి వారణాసిలో ఉపయోగిస్తారనే టాక్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రాజమౌళి సినిమాల్లో సన్నివేశానికి తగ్గ సంగీతం, భక్తి ఎలిమెంట్స్‌కు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ పాట నిజంగానే సినిమాలోని కీలక సన్నివేశంలో వస్తే.. థియేటర్లలో ఆ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పురాణ అంశాలను కలిపి రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. వారణాసి దాదాపు 90 శాతం పూర్తయినట్లు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేష్ బాబు పాల్గొనే భారీ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే మహేష్‌కు సంబంధించిన ప్రధాన షూటింగ్ కూడా పూర్తయ్యే అవకాశముంది.
Also Read : సైమా అవార్డ్స్ 2026: ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్









