Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. సమంత త్వరలోనే తల్లి కాబోతున్నారంటూ, ఆమె అభిమానులకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమయ్యారంటూ గత రెండు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, శనివారం సాయంత్రం జరిగిన ఒక వేడుకలో సమంత ‘బేబీ బంప్’తో దర్శనమివ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సమంత కథానాయికగా, టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ ఈ శుక్రవారం (జూన్ 19న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవీస్’ పతాకంపై స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు -నిర్మాత రాజ్ నిడిమోరు కథను అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ శనివారం ఒక సక్సెస్ మీట్, కేక్ కటింగ్ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. అయితే, ఈ సెలబ్రేషన్స్‌లో అందరి చూపు సామ్ పైనే పడింది. వైట్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన సమంతలో ప్రెగ్నెన్సీ లక్షణాలు (బేబీ బంప్) స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, ఆమె కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ, చేతులతో బేబీ బంప్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించిన విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆమె పూర్తిగా చీరకట్టులో కనిపించడంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు.

గతంలో అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఎన్నో వ్యక్తిగత, ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్న సమంత జీవితంలో ఇప్పుడు సరికొత్త వెలుగు రాబోతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ సిరీస్‌ల కోసం పనిచేస్తున్న సమయంలోనే సమంత, రాజ్ నిడిమోరుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో ‘భూతశుద్ధి’ వివాహ విధానంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఎల్లప్పుడూ ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించే సమంత, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంతకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలను ఆరా తీయగా.. అవును, సామ్ త్వరలోనే అధికారికంగా ఈ శుభవార్తను పంచుకోబోతున్నారంటూ హింట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అటు సమంత కానీ, ఇటు రాజ్ నిడిమోరు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో నటిగా, నిర్మాతగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనందంలో ఉన్న ఈ జంట, త్వరలోనే ఒక ప్రత్యేక ముహూర్తాన ఈ గుడ్ న్యూస్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో సామ్ అభిమానులు పండగ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.