
ఆపరేషన్ సిందూర్‌లో భారత క్షిపణి, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ధాటికి కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్థాన్, ఇప్పుడు తన సైనిక బలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా తన మిత్రదేశమైన తుర్కియేతో ఏకంగా లక్ష ‘మెర్కుట్’ FPV (ఫస్ట్‌పర్సన్ వ్యూ) డ్రోన్ల కొనుగోలుకు మూడేళ్ల భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 10 ఆల్పైన్ మానవరహిత హెలికాప్టర్లు, 25 డుమ్రుల్ మినీ హెలికాప్టర్లు, 500 లాయిటరింగ్ మ్యూనిషన్స్ మరియు 250 కోర్గాన్ గ్రౌండ్ సిస్టమ్స్ పాక్‌కు అందనున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్‌లోనే వీటి తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read : పాక్ ఆర్మీకే చుక్కలు చూపిస్తున్న మాజీ కెప్టెన్.. బలూచ్ తిరుగుబాటుదారుల కొత్త బాస్ ఇతనే!
ఈ డ్రోన్ల స్పెషాలిటీ ఏంటి?
మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్లు: 8 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఇవి 20-30 నిమిషాల పాటు గాల్లో ఎగురుతాయి. వీటిలోని వార్‌హెడ్‌లో 1,000 వరకు 3ఎంఎం స్టీల్ బాల్స్ ఉంటాయి. ఇవి పేలినప్పుడు 20 మీటర్ల పరిధిలో భారీ విధ్వంసం సృష్టిస్తాయి.
ఆల్పైన్ & డుమ్రుల్: ఆల్పైన్ హెలికాప్టర్లు 200 కిలోల పేలుడు పదార్థాలతో అటానమస్‌గా దాడులు చేయగలవు. వీటిలో థర్మల్, నైట్ విజన్ టెక్నాలజీ ఉంది. డుమ్రుల్ మినీ హెలికాప్టర్లు 120 నిమిషాల పాటు గాల్లో ఉండి నిఘా, దాడులు చేస్తాయి.
యుద్ధభూమిలో గేమ్ ఛేంజర్స్: ప్రస్తుత ఆధునిక యుద్ధాల్లో రీపర్లు, బైరక్తర్ల కంటే ఈ చిన్నపాటి ఎఫ్‌పీవీ డ్రోన్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ముందుండే కెమెరా దృశ్యాలను ఆపరేటర్లు ప్రత్యేక గాగుల్స్ (వీఆర్ఎక్స్ మానిటర్లు) ద్వారా లైవ్‌లో చూస్తూ రిమోట్‌తో టార్గెట్‌ను కచ్చితంగా ధ్వంసం చేస్తారు. పైలట్లు 2 నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని సురక్షిత బంకర్లలో ఉండి వీటిని ఆపరేట్ చేయొచ్చు.
కేవలం 500 డాలర్ల (సుమారు రూ.47 వేలు) కంటే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లకు రన్‌వే కూడా అవసరం లేదు, కేవలం 150 అడుగుల స్థలం ఉంటే చాలు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రోజువారీ దాడుల్లో 60 శాతం వీటితోనే జరుగుతుండటం, ఉక్రెయిన్ ఏకంగా 30 లక్షల డ్రోన్లను రంగంలోకి దించడం వీటి సామర్థ్యానికి నిదర్శనం. ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్ల తయారీకి చేతులు కలిపిన పాక్-తుర్కియే, ఈ డ్రోన్ల డీల్‌తో సరిహద్దుల్లో కొత్త సవాలు విసురుతున్నాయి.
Also Read : బంగ్లాదేశ్‌లో మళ్లీ హైటెన్షన్: హసీనా రీ-ఎంట్రీతో అవామీ లీగ్ యాక్టీవ్!









