
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పండుగ సీజన్ సందర్భంగా తీసుకొచ్చిన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్ ఆఫర్లు నడుస్తున్నాయి. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను భారీగా ఇచ్చాయి. ముఖ్యంగా ప్రీమియం ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ఊహించని ధరకు అందుబాటులోకి వచ్చాయి.
Also Read : ఫ్లిప్‌కార్ట్ సేల్ షురూ.. iPhone ఆఫర్లు అదిరిపోయాయ్ మచ్చా..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు
ఈ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఈఎంఐలపై 10 శాతం వెంటనే రాయితీ లభిస్తోంది. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 256GB వేరియంట్ అమెజాన్ అందించే ప్రత్యేక కూపన్లు, ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కలిపి కేవలం రూ.84,999 ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది. ఫ్లాగ్షిప్ మోడళ్లపై 12 నెలల వరకు ఎలాంటి అదనపు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పిన్‌కోడ్ ఆధారంగా ఆర్డర్ చేసిన సేమ్-డే లేదా మరుసటి రోజే డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేశారు.
Also Read : షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. 10 అడుగుల గుంతలోకి కారు!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 సాధారణ సేల్ ధర రూ.84,999గా ఉంది. దీనికి రూ.2,000 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్, మరో రూ.3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ జత చేస్తే.. ఈ ఫోన్‌ను కేవలం రూ.79,999 కే సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ లైవ్ ఆఫర్లలో భాగంగా రూ. 17,250 బేస్ డిస్కౌంట్‌తో పాటు ఎంపిక చేసిన కార్ట్ వ్యాల్యూ పై అదనంగా రూ.13,250 వరకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. అయితే బ్యాంక్ ఇన్స్టంట్ డిస్కౌంట్లు పొందాలంటే క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను మాత్రమే ఉపయోగించాలి. సాధారణంగా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ చెల్లింపులకు బ్యాంక్ ఆఫర్లు వర్తించవు.









