PM Modi : చైనాకు భారత్‌ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. బ్రిక్స్‌ సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక చర్చలు జరిపారు. భారత్‌-చైనా మధ్య సరిహద్దు సమస్యలపై స్పష్టమైన వైఖరిని మోదీ వెల్లడించారు. సరిహద్దులో శాంతి లేకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు వెళ్లడం కష్టమని మోదీ స్పష్టం చేసినట్లు సమాచారం. సరిహద్దు విభేదాలు పెద్ద వివాదాలుగా మారకుండా చూడాలని, సమస్యలకు ఘర్షణల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

భారత్‌-చైనా సంబంధాలు బలపడాలంటే మూడు విషయాలు చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, ఇరు దేశాల ప్రయోజనాలను గౌరవించడం ఆధారంగానే సంబంధాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.

Also Read : పండుగల ఎఫెక్ట్.. ఒకే రోజు 20 లక్షల టికెట్లు.. IRCTC ఆల్ టైమ్ రికార్డు!

అదే సమయంలో గతంలో కుదిరిన సరిహద్దు ఒప్పందాలను చైనా కచ్చితంగా పాటించాలని భారత్‌ కోరింది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద బలగాలను తగ్గించి, అక్కడ శాంతి వాతావరణం ఏర్పడితేనే ఇరు దేశాల మధ్య నమ్మకం మరింత పెరుగుతుందని మోదీ స్పష్టం చేసినట్లు సమాచారం. సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు.

భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరోవైపు భారత్‌లోని ప్రాంతాలకు చైనా వరుసగా కొత్త పేర్లు పెడుతూ వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 60 ప్రాంతాల పేర్లను మార్చినట్లు చెబుతున్నారు. చైనా తీరుపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ వేదికగా సరిహద్దు విషయంలో చైనా దూకుడుకు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చినట్లైంది.

Also Read : తీవ్ర అప్పుల్లో భారతీయ కుటుంబాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.