
Commercial LPG Cylinder : దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. అయితే ఇంట్లో వంటకు ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.62.50 పెరిగింది. దీంతో సెప్టెంబర్‌లో రూ.2,747.50గా ఉన్న సిలిండర్ ధర అక్టోబర్ 1 నుంచి రూ.2,810కి చేరింది.
ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.63 పెరిగింది. అక్కడ సెప్టెంబర్‌లో రూ.2,701గా ఉన్న ధర ఇప్పుడు రూ.2,764కి చేరింది. చెన్నైలో రూ.66.50 పెరిగింది. దీంతో రూ.2,916.50గా ఉన్న సిలిండర్ ధర రూ.2,983కి చేరింది. పాట్నాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా పెరిగింది. అక్కడ ఒక్క సిలిండర్‌పై రూ.71.50 పెంచారు. దీంతో సెప్టెంబర్‌లో రూ.3,029గా ఉన్న ధర అక్టోబర్ నుంచి రూ.3,100.50కి చేరింది. లక్నోలో రూ.62.50 పెంచడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,932.50కి చేరింది.
Also Read : ఏంటి నిజమా? బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా?.. నిజమెంత?
దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగాయి. లేహ్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ.3,385.50 నుంచి రూ.3,450కి చేరింది. తవాంగ్‌లో ధర రూ.3,073.50కి పెరిగింది. అహ్మదాబాద్‌లో కొత్త ధర రూ.2,831.50గా ఉంది. కన్యాకుమారిలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,046కి చేరింది. మరోవైపు ఇంట్లో వంటకు ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పటికీ రూ.942గా ఉంది. ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50గా కొనసాగుతోంది. లక్నోలో రూ.979.50, పాట్నాలో రూ.1,031.50గా గృహ గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ గ్యాస్ ధరల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,747.50గా, కోల్‌కతాలో రూ.2,884గా, ముంబైలో రూ.2,701గా, చెన్నైలో రూ.2,916.50గా ఉంది. అక్టోబర్ 1 నుంచి ఆయా నగరాల్లో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ వంటి అంశాలు దేశంలో గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ ధరల పెంపు ప్రధానంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలపై ప్రభావం చూపనుంది.
Also Read : కెప్టెన్ మచ్చర్ నువ్వో హీరో.. భారత పైలట్‌పై మోదీ ప్రశంసలు









