ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(Delhi JNU) క్యాంపస్‌లో ఇరుమడి మూవీ రిపీట్ అయ్యింది. యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూ, మరోవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిపై ఆరోపణలు వచ్చాయి. జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అంగోంచా బిమోల్ అకోయిజమ్ అదే యూనివర్సిటీకి చెందిన 11 మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులు అందాయి. విద్యార్థినులకు మార్కులు వేయడంలో, వైవా పరీక్షలు నిర్వహించే సమయంలో ఆయన తన హోదాను అడ్డం పెట్టుకుని వేధించాడని ఆరోపించారు.

Also Read : ఇకపై జంతర్ మంతర్‌లో నో పర్మిషన్.. ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం!

తరగతి గదుల్లోనూ, క్యాంపస్‌లోని తన అధికారిక నివాసానికి స్పెషల్ క్లాస్ అని పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థినులు ఆరోపించారు. తన కోరికలు తీర్చితేనే పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరించాడని ఆ విద్యార్థినులు పోలీసులకు మే నెలలో ఫిర్యాదు చేశారు. అయితే ఇతను కేవలం ప్రొఫెసర్‌ మాత్రమే కాదు.. రాజకీయాల్లో కూడా ఉన్నారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Also Read : మహారాష్ట్రలో కేతన్ తరహా మరో హత్య.. ప్రియురాలిని లోయలోకి తోసి చంపిన ప్రియుడు..!

బాధిత విద్యార్థినులు కలిసి ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌పై జేఎన్‌యూ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమకు విద్యను నేర్పించాల్సిన గురువే, కామ వాంఛలు తీర్చాలని కోరడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా తాకడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ఫోన్లలో లేదా నేరుగా వేధించడం వంటి చర్యలకు ఆయన పాల్పడ్డారని విద్యార్థినులు స్పష్టంగా పేర్కొన్నారు. తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి, ఇతర విద్యార్థినులకు ఇలాంటి అన్యాం జరగకూడదనే ధైర్యంగా బయటకు వచ్చి ఆయనపై పోరాటానికి సిద్ధమయ్యామని వారు తెలిపారు. అయితే అతనిపై కేసు నమోదు అయిన వెంటనే జేఎన్‌యూ యంత్రాంగం అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ విచారణ జరిపిన తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనితో స్పందించిన జేఎన్‌యూ యాజమాన్యం ఆయనను అక్టోబర్ 9న ప్రొఫెసర్ విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తనపై వస్తున్న ఈ ఆరోపణలను ఎంపీ బిమోల్ అకోయిజమ్ పూర్తిగా ఖండించారు. ఇదంతా తనపై కావాలనే చేస్తున్న రాజకీయ కుట్ర అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని వాదించారు. ఈ ఘటనకు సంబంధించి నిజాలు బయటకు రావడంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లోని ప్రధాన ప్రాంతాలైన సాబర్మతి దాబా, వైస్ ఛాన్స్‌లర్ కార్యాలయం వద్ద వివిధ విద్యార్థి సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ ప్రొఫెసర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎంపీ కావడంతో నిరసనలు ఇంకా ఎక్కువయ్యాయి. బీజేపీ నాయకులు అకోయిజంకు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన వ్యక్తిని కాంగ్రెస్ ఎందుకు రక్షిస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ మాట్లాడి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.