
ప్రస్తుతం చాలామంది ఉదయాన్నే పరగడుపున రకరకాల హెల్త్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. వీటిలో బీట్రూట్ జ్యూస్(Beetroot Juice) కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, రోజంతా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అయితే రుచికి కాస్త తియ్యగా ఉండే ఈ బీట్రూట్ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : ప్లేన్ కూల్చేయడమే ప్లానా.. ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు!
బీట్రూట్ తియ్యగా ఉన్నప్పటికీ.. దీనిని మోతాదుగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవని, పైగా నియంత్రణలోనే ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బీట్రూట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా ఇందులో ఉండే ‘ఫైటోకెమికల్స్’, ‘బీటెయిన్’ వంటి ప్రయోజనకరమైన కాంపౌండ్లు, బలమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోకుండా అడ్డుకుంటాయి.
బీట్రూట్ను నేరుగా కట్ చేసుకుని సలాడ్‌లా తిన్నప్పుడు అందులోని పీచు పదార్థం పూర్తిస్థాయిలో లభిస్తుంది. అయితే జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు ఫైబర్ పరిమాణం కాస్త తగ్గుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలనుకునేవారు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. జ్యూస్‌లో ఎలాంటి పంచదార లేదా కృత్రిమ తీపి పదార్థాలను కలపకూడదు. వడకట్టకుండా కాస్త పీచు పదార్థంతో కూడిన జ్యూస్‌ను తాగడం మంచిది. రోజుకు సుమారు 150ml నుంచి 200ml పరిమితికి మించకుండా తీసుకోవాలి.
ఉదయాన్నే పరగడుపున బీట్రూట్ తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బీట్రూట్లో సహజ నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరించి, రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు త్వరితగతిన అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే ఈ జ్యూస్‌లో ఎలాంటి తీపి లేదా పంచదార కలపకుండా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
Also Read : అమిత్ షానే మా నెక్ట్స్ టార్గెట్.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఓపెన్ ఛాలెంజ్









