Agniveer : భారత సైన్యం అగ్నివీర్ CEE ఫలితాలు 2026 అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. జూన్ 1 నుండి జూన్ 16, 2026 వరకు జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన అభ్యర్థులు, ఇప్పుడు తమ అర్హతను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసుల (ARO) వారీగా మెరిట్ లిస్ట్ PDFలను సైన్యం అందుబాటులో ఉంచింది.

ఫలితాలను చూసే విధానం:

మొదటగా అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ను సందర్శించండి.

హోమ్ పేజీలో ఉన్న ‘అగ్నివీర్ CEE రిజల్ట్ 2026’ విభాగాన్ని ఓపెన్ చేయండి.

మీరు దరఖాస్తు చేసుకున్న సంబంధిత ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసు (ARO) లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి.

మెరిట్ లిస్ట్ PDFని డౌన్‌లోడ్ చేసుకోండి.

PDFలో ‘Ctrl + F’ నొక్కి మీ రోల్ నంబర్ లేదా పేరును ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి.

మీ వివరాలు ఉంటే, భవిష్యత్ అవసరాల కోసం ఆ PDFని సేవ్ చేసుకోండి.

అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, దరఖాస్తు చేసిన పోస్ట్/ట్రేడ్, ARO, కేటగిరీ, ఎంపిక స్థితి, తదుపరి దశకు సంబంధించిన సూచనలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే సంబంధిత ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసును సంప్రదించాలి.

ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలకు సిద్ధం కావాలి. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

ఈ ఫలితాలు బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని AROల కోసం విడుదలయ్యాయి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, ఉమెన్ మిలిటరీ పోలీస్, సపాయ్ ఫార్మా , సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.