iPhone 16 Offers
iPhone 16 Offers

iPhone 18 Pro సిరీస్‌ విడుదలకు ముందు.. దాని పాత సిరీస్‌‌లోని పలు మోడళ్ల ధరలు భారీగా తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కంపెనీ భారీగా ధరలు పెంచేసింది. దీంతో ఐఫోన్ కొనాలనుకున్న ఎంతోమంది ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఇప్పుడు అలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. iPhone 16పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు ఈ కామర్స్ సైట్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.15వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు.

ఆపిల్ అధికారిక వెబ్‌సైట్లో ఈ iPhone 16 రూ.89,900 కు లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు దీనిని Amazonలో చాలా తక్కువకే కొనుక్కోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 నడుస్తుంది. ఈ సేల్‌లో భాగంగానే ఐఫోన్ 16ను వేల రూపాయల తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు దీని ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

iPhone 16 Offers

ఐఫోన్ 16లోని 128GB స్టోరేజ్ వేరియంట్.. కంపెనీ అధికారిక సైట్‌లో రూ.89,900గా ఉంది. అయితే ఇప్పుడు ఇది అమెజాన్‌లో కేవలం రూ.76,999 ధరకే లభిస్తోంది. అంటే కంపెనీ అందించే ధర కంటే.. అమెజాన్ అందించే ధరలో రూ.12,901 తగ్గుతుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో iPhone 16 రూ.73,999లకే లభిస్తుంది. ఈ తగ్గింపుతో మొత్తం రూ.15,901సేవ్ చేసుకోవచ్చు.

iPhone 16 Specifications

iPhone 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌, 6.10-అంగుళాల సూపర్ రెటినా XDR టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఈ iPhone హెక్సా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్ అందించారు. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్ అమర్చారు. ఈ ఫీచర్ కారణంగా ఈ ఫోన్ 6 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలదు. సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్ అందుబాటులో ఉన్నాయి. iPhone 16 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను అందించారు. ఈ ఐఫోన్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఇన్-బిల్ట్ రీఛార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 30 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.